రూ. 5కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరు జవాన్ల అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

డెహ్రడూన్:సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న రాజు షేక్, పూల్‌సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మంజు రెహమాన్ కూడ అదుపులోకి తీసుకొన్నారు.

ఇద్దరు జవాన్లు హెరాయిన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిన తర్వాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్‌లో భాగంగా ఈ కారును సోదా చేయడంతో ఈ హెరాయిన్ బయటపడింది.

Dehradun: Two Army jawans arrested with heroin worth Rs 5 crore

అయితే కారును పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో తాము జవాన్లమంటూ నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

నిందితులపై మాదకద్రవ్యాల అక్రమరవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు డెహ్రడూన్ సీనియర్ ఎస్‌పి నివేదిత తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: 2 Army jawans arrested
English summary
Dehradun Police have arrested two Army jawans and one other with heroin worth Rs five crore. A revolver along with 13 live cartridges were also seized from their possession.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X