వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలో మరో కోణం చూపిస్తా: గవర్నర్‌కు శశికళ! జయ సమాధి ఎదుట..

తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆహ్వానించకపోవడం ఓవైపు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తుండటం మరోవైపు.. ఈ నేపథ్యంలో శశికళ అసహనానికి గురవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆహ్వానించకపోవడం ఓవైపు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తుండటం మరోవైపు.. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళ అసహనానికి, ఆగ్రహానికి గురవుతున్నారు.

శశికళ స్వరం పెంచారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనలో మరో కోణం చూస్తారని హెచ్చరించారు. శశికళ హెచ్చరికల నేపథ్యంలో అల్లర్లపై నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

గవర్నర్ పైన పోరాటమే..

గవర్నర్ పైన పోరాటమే..

గవర్నర్నర్ పైన ఓ విధంగా పోరాడేందుకే ఆమె సిద్ధమయ్యారు. పార్టీని చీల్చడానికి గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారట. ప్రధాని డైరెక్షన్లో రాజ్ భవన్ లీకులిచ్చిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. గవర్నర్ అపాయింటుమెంట్ కోసం మరో ఘాటైన లేఖ రాశారు. గవర్నర్ అనుమతించకుంటే రాష్ట్రపతి వద్ద ఎమ్మెల్యేలతో పరేడ్ లేదా జయలలిత సమాధి వద్ద ఆమరణ దీక్షకు దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

గవర్నర్‌తో సుబ్రహ్మణ్య స్వామి భేటీ

గవర్నర్‌తో సుబ్రహ్మణ్య స్వామి భేటీ

శశికళ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద భద్రతను పటిష్టం చేశారు. చెన్నైలో అడుగడుగునా పోలీసు తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.

శశికళ వర్గం నుంచి...

శశికళ వర్గం నుంచి...

శశికళ వర్గం నుంచి ఇప్పటికే ఐదుగురు మంత్రులు జంప్ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వం వైపు వచ్చారు. కాగా, శనివారం ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ 30 మందిని ఏపీకి తరలించారని తెలుస్తోంది.

సాఫ్ట్ నుంచి స్వరం పెరిగింది

సాఫ్ట్ నుంచి స్వరం పెరిగింది

అధికారానికి అవకాశమివ్వాలని గురువారం గవర్నర్‌ను కోరిన శశికళ.. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారన్న నమ్మకముందని శుక్రవారం ప్రకటించగా.. శనివారం రాత్రి స్వరం మరింత పెంచారు. ఇప్పటి వరకు నిరీక్షించామని, ఇక మాలోని మరో కోణం చూస్తారని గవర్నర్‌ను ఉద్దేశించి పరోక్ష హెచ్చరికలు చేశారు. గవర్నర్‌ కాలయాపన చేయడం అన్నాడీఎంకేను చీల్చే చర్యేనన్నట్టుగా పేర్కొన్నారు.

ఆందోళనలు

ఆందోళనలు

ఆదివారం నుంచి వినూత్నరీతిలో ఆందోళనలు చేస్తామని శశికళ ప్రకటించారు. పరోక్షంగా గవర్నర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించటంతో రాజ్ భవన్‌తోపాటు చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆస్తుల కేసు వచ్చే వరకు...

ఆస్తుల కేసు వచ్చే వరకు...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళపై సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేంత వరకు గవర్నర్‌ నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో శనివారం శశికళ తన స్వరం పెంచారు. తనకు మద్దతు పలుకుతున్న శాసనసభ్యులతో శనివారమే రాజ్‌భవన్‌లో కలిసే అవకాశమివ్వాలని ఆమె గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ ఉదయం లేఖ రాశారు. రాజ్‌భవన్‌ నుంచి అనుమతి లభిస్తే శాసనసభ్యులతో ఆయన ఎదుట పరేడ్‌ నిర్వహించాలని ఆమె భావించారు. కానీ రాత్రి వరకు రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

అంతకుముందు..

అంతకుముందు..

అంతకుముందు శశికళ కార్యకర్తలతో మాట్లాడుతూ...జాప్యంపై తన అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరింత కాలయాపన చేస్తే అందరం కలిసి చేయాల్సింది చేస్తాం అంటూ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను అన్నాడీఎంకే రాజ్యసభ ఎమ్పీ, పన్నీరుసెల్వం మద్దతుదారు మైత్రేయన్‌ ఖండించారు. వ్యాఖ్యలపై రాష్ట్రపతి, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.

English summary
The delay in her accession to the post of Tamil Nadu Chief Minister was designed to "create a split" in the ruling AIADMK party, VK Sasikala alleged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X