వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 రోజుల్లోనే 498 బ్లాక్ ఫంగస్ కేసులు-మందు దొరక్క అల్లాడుతున్న రోగులు-ఢిల్లీలో దారుణ పరిస్థితులు

|
Google Oneindia TeluguNews

ఓవైపు కరోనా కట్టడికే ప్రభుత్వాలు సతమతమవుతుంటే... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకొర్‌మైకోసిస్) రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది. ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్‌కు కూడా మందుల కొరత కారణంగా అదే పరిస్థితి తలెత్తుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరట కలిగించే అంశమే అయినా... అదే సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలో 498 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఇలా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా కేంద్రం నుంచి రాష్ట్రాలకు తగిన స్థాయిలో మందుల సప్లై జరగట్లేదు.

వారం రోజుల్లో 773 కేసులు

వారం రోజుల్లో 773 కేసులు

ఢిల్లీ ప్రభుత్వం తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల జాబితాలో చేర్చించింది. దేశవ్యాప్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా ఇప్పటికే పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను గుర్తించదగిన అంటువ్యాధిగా ప్రకటించాయి. ఢిల్లీలో గత కొద్దిరోజులుగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే 23న 200 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. మే 24న 75,మే 25న 70,మే 26న 153 కేసులు నమోదయ్యాయి. గురువారం(మే 27) నాటికి గడిచిన వారం రోజుల్లో ఢిల్లీలో మొత్తం 773 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

వారానికి కేవలం 3వేల వయల్స్...

వారానికి కేవలం 3వేల వయల్స్...


బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు అంఫోటెరిసిన్-బి అనే ఇంజెక్షన్ కీలకం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మందుకు తీవ్ర కొరత నెలకొంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ...'రోజుకు 350కి మించి అంఫోటెరిసిన్ వయల్స్‌ రావట్లేదు. అది కూడా గత మూడు రోజులుగానే వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఢిల్లీకి రోజుకు 3వేల వయల్స్ అవసరం ఉంది. వారానికి దాదాపు 30వేల వయల్స్ అవసరం ఉండగా... మంగళవారం నాటికి మొత్తం 3850 వయల్స్ మాత్రమే అందాయి.' అని చెప్పుకొచ్చారు.

కేంద్రానికి హైకోర్టు విజ్ఞప్తి...

కేంద్రానికి హైకోర్టు విజ్ఞప్తి...

అంఫోటెరిసిన్ బీ కొరతపై గురువారం(మే 26) ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దుబాయిలో అంఫోటెరిసిన్ బి డ్రగ్ అందుబాటులో ఉందన్న సమాచారం మేరకు... అక్కడి నుంచి రాష్ట్రాలు దిగుమతి చేసుకునేందుకు సుంకాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన లేదు. మరోవైపు ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రులు అంఫోటెరిసిన్ డ్రగ్ కోసం అల్లాడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోందని... సకాలంలో అంఫోటెరిసిన్ ఇవ్వకపోతే పేషెంట్ల పరిస్థితి చేయి దాటుతుందని వైద్యులు వాపోతున్నారు. సర్ గంగారాం ఆస్పత్రిలో 63 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు అక్కడి మెడికల్ సూపరింటెండెంట్ డా.డీఎస్ రానా తెలిపారు. వీళ్లలో చాలామంది పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. ఇప్పటివరకూ కేవలం 90 అంఫోటెరిసిన్ వయల్స్ మాత్రమే తమకు అందాయని... ఇలాగైతే పరిస్థితులు మరింత దిగజారుతాయని అన్నారు.

Recommended Video

#TopNews : Yaas Cyclone Update | Mahesh Surprise On May 31 || Oneindia Telugu
పెరుగుతున్న కేసులు... డ్రగ్ కొరత...

పెరుగుతున్న కేసులు... డ్రగ్ కొరత...

బ్లాక్ ఫంగస్ పేషెంట్ల చికిత్సకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,గురు తేజ్ బహదూర్,లోక్ నాయక్ జైప్రకాశ్ ఆస్పత్రులను నోడల్ కేంద్రాలుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గురుతేజ్ ఆస్పత్రిలో 74 మంది,లోక్‌నాయక్ ఆస్పత్రిలో 55 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మూడు ఆస్పత్రులకు నిత్యం 8 కొత్త బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇవిగాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చాలానే కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యకు తగినట్లు అంఫోటెరిసిన్ బి డ్రగ్‌ను అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి.

English summary
Delhi has recorded 498 cases of mucormycosis or black fungus in just four days, prompting the Aam Aadmi Party (AAP) government to declare the disease as an epidemic. The Delhi government notified the disease late Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X