Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం : 62 ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడి-కత్తితో 20 సార్లు పొడిచిన నిందితుడు

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తి... కత్తితో ఆమెను 20 సార్లు పొడిచాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు ఎందుకీ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదు.

వివరాల్లోకి వెళ్తే... బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు ఢిల్లీలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. ఆమె మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం(జూన్ 12) మనవడు డ్యూటీకి వెళ్లగా... ఆమె కూరగాయలు అమ్మేందుకు వెళ్లింది. కొద్దిగంటల తర్వాత తిరిగి ఇంటి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది.

Delhi 62 years old woman sexually assaulted and stabbed 20 times

ఇంట్లో వృద్దురాలు ఒంటరిగా ఉన్న విషయం గమనించిన ఓ వ్యక్తి... ఇదే అదనుగా లోపలికి చొరబడి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె శరీరంపై 20 సార్లు పొడిచాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అప్పటికే వృద్దురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్దారించారు.

Recommended Video

    #TOPNEWS: Low Pressure Over North Bay Of Bengal | Oneindia Telugu

    వృద్దురాలిపై కత్తితో దాడి చేయడం కంటే ముందు... నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. కత్తితో ఆమె గొంతు కోసిన ఆనవాళ్లు గుర్తించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు... ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడించాడు. అయితే వృద్దురాలిని అతను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులు వెల్లడించలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+