వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగసన్యాసుల మఠంలో అరుదైన బుధ్దుడి విగ్రహం చోరీ, అక్కడికి ఆమె ఎలా వెళ్ళింది?

భారతదేశంలోనే అతిపెద్ద బౌధ్ధారామమైన అరుణచల్ ప్రదేశ్ లోని తవాంగ్ మఠంలో చోరికి గురైన పురాతన విగ్రహం ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.ఈ విగ్రహన్ని ఢిల్లీ పోలీసులు సోమవారంనాడు స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ:భారతదేశంలోనే అతిపెద్ద బౌధ్ధారామమైన అరుణచల్ ప్రదేశ్ లోని తవాంగ్ మఠంలో చోరికి గురైన పురాతన విగ్రహం ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.ఈ విగ్రహన్ని ఢిల్లీ పోలీసులు సోమవారంనాడు స్వాధీనం చేసుకొన్నారు.

ఢిల్లీలోని మంజాకా టిల్లా ప్రాంతంలో విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు చెప్పారు.కాగా, పట్టుబడిన మహిళే విగ్రహన్ని చోరిచేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Delhi: 900-year-old Lord Buddha statue recovered, two arrested

మగసన్యాసుల మఠంలోకి ఆమె ఎలా ప్రవేశించింది? చోరీలో ఇంటిదొంగల హస్తం కూడ ఉందా? అనే కోణంలో కూడ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బౌధ్ధారామంగా ఖ్యాతికెక్కిన తవాంగ్ మఠంలోని ఈ బుద్ద విగ్రహం అరుదైందిగా భావిస్తున్నారు.

వందల ఏళ్ళుగా పూజలు అందుకొంటున్న ఈ విగ్రహం చోరికి గురికావడం సంచలనలం రేపింది. పట్టువిడకుండా పోలీసులు సాగించిన దర్యాప్తుతో నిందితులు దొరికారు.అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లా కేంద్రంలో అదే పేరుతో కొనసాగుతున్న తవాంగ్ బౌద్ధారామం భారతదేశంలోని అతిపెద్ద అరామంగా కొనసాగుతోంది. లాసా లోని పోతల ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద బౌధ్ధారామంగా ఖ్యాతి గడించింది. ఆ తర్వాతి స్థానం తవాంగ్ దే కావడం విశేషం. ఏటా ఇక్కడికి లక్షలాది మంది బౌద్ధ ఆరాధకులు వస్తుంటారు.

English summary
A 900 year old statue of Lord Buddha that was stolen from Arunachal Pradesh was recovered on Monday from Delhi's Majnu Ka Tilla area. The Delhi Crime Branch has arrested two in connection with the case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X