ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ 7రోజులుగా.. సర్వర్లో కీలక డేటా; రూ.200 కోట్ల డిమాండ్!!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. హ్యాకర్లు దేశంలోని కీలకమైన వెబ్ సైట్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు 200 కోట్ల రూపాయల డబ్బులను క్రిప్టో కరెన్సీ రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్ నిర్వహించే మెయిన్ సర్వర్ నవంబర్ 23 వ తేదీ నుండి హ్యాక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వరుసగా ఎయిమ్స్ సర్వర్ ఏడవ రోజు పని చేయడం లేదు.

ఎయిమ్స్ సర్వర్ హ్యాక్.. 200 కోట్ల రూపాయల డిమాండ్
ఎయిమ్స్ మెయిన్ సర్వర్ డౌన్ ఉన్న కారణంగా ఎయిమ్స్ లో క్లిష్టమైన అత్యవసర సేవలు, పేషెంట్ కేర్, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ తోపాటు ల్యాబరేటరీ విభాగాలను ప్రస్తుతం మాన్యువల్ గా నిర్వహిస్తోంది. నివేదికల ప్రకారం హ్యాక్ అయిన సర్వర్లో దాదాపు మూడు నుండి నాలుగు కోట్ల మంది రోగుల డేటా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కంప్యూటర్లలోకి ర్యాన్సన్ వేర్ ను చొప్పించి ఆ కంప్యూటర్ లను పని చేయకుండా చేశారని తెలుస్తుంది. తమకు రెండు వందల కోట్ల రూపాయలను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లిస్తేనే తాము తిరిగి సర్వర్లు పనిచేసేలా చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నట్టు సమాచారం.

సైబర్ టెర్రరిజం కేసు నమోదు
ఇక ఈ హ్యాకింగ్ పై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, ఢిల్లీ పోలీసులు మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలన చేస్తున్నారు. అంతేకాదు నవంబర్ 25వ తేదీన ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం ఎయిమ్స్ సేవలకు అంతరాయం కలిగించి , దాని సర్వర్ ను హ్యాక్ చేసిన కారణంగా హ్యాకర్ల పై దోపిడీ మరియు సైబర్ టెర్రరిజం కేసును నమోదు చేశారు. అంతేకాదు దర్యాప్తు సంస్థ సూచనల మేరకు ఆసుపత్రిలో పనిచేస్తున్న కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేసినట్టు సమాచారం.

ఎయిమ్స్ మెయిన్ సర్వర్ లో ప్రముఖుల కీలక సమాచారం
ఎయిమ్స్ మెయిన్ సర్వర్లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులతో పాటు ఇతర ముఖ్యమైన పౌర సేవ అధికారులు, వీవీఐపీలు తదితర ప్రముఖ వ్యక్తుల డేటా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్‌ఐసి అధికారులు ఈ- హాస్పిటల్ డేటాబేస్ ను, ఈ- హాస్పిటల్ సర్వర్ల నుండి ఇన్ఫెక్షన్ ను తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ- హాస్పిటల్ కోసం అప్లికేషన్ సర్వర్లను పునరుద్ధరించారు. డేటాబేస్‌లు మరియు అప్లికేషన్‌ల కోసం ఇ-హాస్పిటల్ సేవలను పునరుద్ధరించడానికి ఎన్‌ఐసి బృందం నాలుగు సర్వర్‌లను ఏర్పాటు చేసి మరీ పని చేస్తుంది.

అన్ని కంప్యూటర్ లను యాంటీ వైరస్ తో సిద్ధం చేస్తున్న ఎన్ఐసీ బృందం
ఇదిలా ఉంటే ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్వర్లు, కంప్యూటర్లను యాంటీవైరస్ సొల్యూషన్ లతో మళ్లీ సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఐదు వేల కంప్యూటర్లలో ఇప్పటికి 1200 కంప్యూటర్లు యాంటీవైరస్ అందించబడ్డాయి. 24 గంటలు ఎయిమ్స్ లో సర్వర్ల సేవలను పునరుద్ధరించడం కోసం ఎన్ఐసి బృందం విపరీతంగా కష్టపడుతోంది. నెట్వర్క్ శానిటైజేషన్ ప్రక్రియ మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ- హాస్పిటల్ సేవలను దశలవారీగా విస్తరించవచ్చు అని భావిస్తున్నారు. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ అపాయింట్మెంట్ , టెలి కన్సల్టేషన్ వంటి డిజిటల్ సేవలు సర్వర్ అంతరాయంతో ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం అన్నీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చేస్తున్న కారణంగా, ఆసుపత్రి సిబ్బంది కూడా సర్వర్ హ్యాకింగ్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications