వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా..! ఫైన్ కడతారా ? ఢిల్లీ సర్కార్ అల్టిమేటం..!
ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థా తమ ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఇంటి వద్ద నుంచే పని (work from home) చేయించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
జాతీయ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (delhi air pollution) అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే వాయు కాలుష్య సూచీ (AQI) 498 పాయింట్లకు చేరిపోయింది. ఇది అత్యంత తీవ్ర స్ధాయిలో కాలుష్య నియంత్రణ మండలి కూడా చెబుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రోజూ ఆఫీసులకు ఉద్యోగుల్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించి, ఇంటి దగ్గరి నుంచే పని చేయించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఢిల్లీ సర్కార్ ఇవాళ కంపెనీలకు తీవ్ర హెచ్చరిక చేసింది.
ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థా తమ ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఇంటి వద్ద నుంచే పని (work from home) చేయించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నిబంధనల్ని సవరించింది. ఈ రూల్ ను ఉల్లంఘించి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పిస్తే తీవ్ర జరిమానాలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో కంపెనీలు ఆలోచనలో పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్ని సైతం ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు.

మొన్న రాజధాని ఢిల్లీలో ఏక్యూఐ 498గా నమోదైన నేపథ్యంలో కాలుష్య నాణ్య నిర్వహణ కమిషన్ అత్యంత కఠినమైన గ్రాప్ 4 ఆంక్షల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. కాలుష్య నియంత్రణ ఆంక్షల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో, ఇప్పటికే తమ వద్ద నమోదైన నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం రూ.10వేలు పరిహారం ప్రకటించింది. గత శనివారం నుండి సోమవారం వరకు దట్టమైన పొగమంచు రాజధానిని కమ్మేయడంతో పలు రోడ్డు ప్రమాదాలు, వాహనాల ప్రమాదాలు, విమాన రద్దు, ఆలస్యాలు చోటు చేసుకున్నాయి.

గ్రాప్ 4 నిబంధనల ప్రకారం జాతీయ రాజధాని పరిధిలోని నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా అన్ని ప్రాంతాలలో ఐదు పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక తప్పనిసరి చేశారు. నగరంలోకి బీఎస్-6 నిబంధనల కంటే తక్కువ ప్రమాణాలున్న ఢిల్లీయేతర వాహనాల ప్రవేశాన్ని ప్రభుత్వం నిషేధించింది. పొల్యూషన్ సర్టిఫికేట్లు లేని వాహనాలకు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ పోయడాన్ని కూడా నిషేధిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే 6 నుండి 9 తరగతులకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రభుత్వాలు హైబ్రిడ్ విధానాన్ని (భౌతిక మరియు ఆన్‌లైన్ తరగతులు) అనుసరించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications