విమానం కిందికి దూసుకెళ్లిన కారు: ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం(వీడియో)

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ కారు.. విమానాశ్రయంలో నిలిచివున్న ఇండిగో ఏ320నియో విమానం కిందకు దూసుకెళ్లింది. అయితే, విమానం ముందు టైర్‌ను ఢీకొట్టకుండా తృటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులోని టీ2 టెర్మినల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సివిల్ ఏవియేషన్ రెగ్యూలేటర్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Delhi Airport: Go First Car Passes Under IndiGo Plane, Narrowly Misses Wheel

ఆ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారనే అనుమానంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేశారు. అయితే ఈ పరీక్షలో అతడు ఎలాంటి మద్యం సేవించలేదని తేలిందని అధికారులు మీడియాకు తెలిపారు.

పాట్నాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం కిందకి గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు దూసుకెళ్లింది. అయితే, విమానానికి అతి స్వల్ప దూరంలోనే ఆగింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో షెడ్యూల్ ప్రకారమే ఆ ఇండిగో విమానం పాట్నాకు బయల్దేరి వెళ్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై అటు ఇండిగో ఎయిర్‌లైన్స్ గానీ, గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది గానీ స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+