ఈ ఏడాదిలో ఈ 4 రాశులు కోటీశ్వరులవుతున్నారు

జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువుల సంచారానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. సాధారణంగా వీటిని 'ఛాయా గ్రహాలు' లేదా 'కీడు గ్రహాలు' అని పిలిచినప్పటికీ, ఇవి ఇచ్చే ఫలితాలు మాత్రం అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ప్రతి 18 నెలలకొకసారి ఇవి రాశులను మారుస్తుంటాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న రాహు, కేతువులు తమ స్థానాలను మార్చుకుని సరికొత్త రాశిలోకి ప్రవేశించబోతున్నాయి.

ఈ మహా సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి, అఖండ ధనలాభం కలగబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ రాశులవారు శివుడిని ఆరాధించడం, గణపతిని పూజించడం వల్ల వేగంగా ఫలితాలను పొందుతారు.

Horoscope People of these four zodiac signs are becoming multi-millionaires this year

కన్యా రాశి వారి పెట్టుబడులకు భారీ లాభాలు

కన్యా రాశి వారికి ఈ సమయం బంధాల పరంగా, ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతోంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. పార్ట్‌నర్స్‌తో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో భారీ మొత్తంలో రిటర్న్స్ అందుతాయి. వైవాహిక జీవితం ఎంతో మధురంగా, ఆనందంగా సాగుతుంది.

ధనుస్సు రాశి వారికి ఆస్తుల కొనుగోలు యోగం

కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం విషయంలో ధనుస్సు రాశి వారికి ఈ సంచారం ఒక వరం లాంటిది. కోర్టు గొడవలు లేదా భూమికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో గొడవలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఈ సమయంలో కొత్త వాహనాలులేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే బలమైన యోగం ఉంది.

మేష రాశి వారికి కెరీర్‌లో అద్భుత ప్రగతి

రాహు-కేతువుల అనుగ్రహంతో మేష రాశి వారి వృత్తిపరమైన జీవితంలో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. ఆఫీసులో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలతో పాటు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. సొంత వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభాల పంట పండిస్తుంది.

సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే

సింహ రాశి వారికి ఈ గ్రహ సంచారం పట్టిందల్లా బంగారంగా మార్చబోతోంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా పూర్తవుతాయి. కార్యాలయంలో మీ హోదా, పలుకుబడి పెరుగుతాయి. పైఅధికారుల మద్దతు లభిస్తుంది. మానసిక ఆందోళనలు తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది సువర్ణావకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+