వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది.. ఇంటి తాళాలకు కూడా వాస్తు ఉంటుంది!

ఇల్లు ఎంత అందంగా ఉన్నా.. అందులో ఉండే వస్తువులను సరైన స్థానంలో ఉంచకపోతే వాస్తు దోషాలు తప్పవని జ్యోతిష్య, వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్టమైన దిశ, స్థానం ఉంటాయి. తప్పుడు దిశలో ఉంచే వస్తువుల నుంచి వెలువడే ప్రతికూల శక్తి వల్ల అదృష్టం కాస్తా దురదృష్టంగా మారుతుంది. దీనివల్ల చేసే పనుల్లో ఆటంకాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబ సభ్యుల మధ్య అనవసర గొడవలు జరుగుతుంటాయి.

ఎప్పుడూ పడమర దిశలోనే ఉంచండి

మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన, భద్రతకు చిహ్నమైన 'తాళంచెవుల ' విషయంలో చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. తాళాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మరి ఇంట్లో సంపద పెరిగి, సానుకూలత నిండాలంటే తాళాల విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకుందాం. తాళాలు పెట్టడానికి పడమర దిశ ఉత్తమం.

Vastu Tips According to the principles one should follow this even for house keys

వాస్తు నియమాల ప్రకారం ఇంటి తాళంచెవులను ఎల్లప్పుడూ పడమర దిశలోనే ఉంచాలి. తాళాలను టేబుళ్ల పైన, సోఫాల పైన పడేయకుండా ఒక పద్ధతి ప్రకారం కీ-స్టాండ్ లేదా కీ-బాక్స్‌లో సర్ది ఉంచాలి. దీనివల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ నిండి, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కిచెన్ అనేది అగ్నితత్వానికి ప్రతీక. పవిత్రమైన వంటగదిలో తాళాలను ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. ధన, ధాన్య నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది.

చెక్కతో చేసిన కీస్టాండ్ ఉత్తమం

దేవుడి గది అత్యంత పవిత్రమైన చోటు. బయటకు వెళ్లి వచ్చే తాళాలు లోహంతో కూడినవి కావడం వల్ల, వాటిని పూజా గదిలో పెడితే అక్కడ ఉండే సానుకూల శక్తి క్షీణించి ప్రతికూలత పెరుగుతుంది. బెడ్‌రూమ్‌లో తాళాలను ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది దంపతుల మధ్య మనస్పర్ధలకు, మానసిక ఒత్తిడికి, నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. మీ ఇంట్లోని కీ-స్టాండ్ ప్లాస్టిక్ లేదా ఇనుముది కాకుండా 'చెక్క'తో చేసినదైతే వాస్తు పరంగా ఎంతో శుభప్రదం. తాళాలు తగిలించే బోర్డుపై 'స్వస్తిక్' లేదా 'ఓం' వంటి పవిత్ర గుర్తులను ఉంచడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు.

వారానికి ఒకసారి కీ-స్టాండ్ క్రింద ఒక తాజా తులసి ఆకును ఉంచితే, ఆ ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యమైన తాళంచెవికి చిన్న పసుపు రంగు రిబ్బన్‌ను కట్టడం వల్ల, మీరు తలపెట్టిన పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతి శనివారం కీ-స్టాండ్‌ను శుభ్రం చేయడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఎప్పుడో వాడేసిన పాతబడిన, తుప్పు పట్టిన లేదా విరిగిపోయిన తాళాలను ఉంచకూడదు. వాటిని వెంటనే ఇంటి నుండి తొలగించాలి, లేదంటే తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+