ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
టేకాఫ్‌కు వెళ్లే క్రమంలో విమానం అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. విద్యుత్ పోల్ కూడా వంగిపోయింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
బోయింగ్ 737-800 విమానం ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత ప్యాసింజర్ టెర్మినల్ నుంచి రన్‌వేకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూకి వెళ్లేందుకు సిద్ధమైన ఈ విమానం ప్రమాదానికి గురికావడంతో దాని కుడి రెక్క స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో ఐలరాన్ దెబ్బతింది.

ఇక విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులకు మరో విమానంలో తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ సంఘటన గురించి తెలియజేస్తూ, స్పైస్‌జెట్ ప్రతినిధి ఇలా అన్నారు.. "ఈరోజు, స్పైస్‌జెట్ ఫ్లైట్ SG 160 ఢిల్లీ-జమ్మూల మధ్య పనిచేయవలసి ఉంది. పుష్ బ్యాక్ సమయంలో, కుడి-వింగ్ వెనుక అంచు ఒక పోల్‌తో ఢీకొట్టడంతో ఐలెరాన్‌కు నష్టం కలిగించింది' అని తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, వారిని మరో విమానంలో గమ్యస్థానం పంపినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications