ఢిల్లీ ఆర్చీబిషప్ అనిల్ కౌటో లేఖ: రాజకీయ దుమారం, బిషప్‌కు బిజెపి కౌంటర్
న్యూఢిల్లీ: దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం ఉందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని ఢిల్లీ ఆర్చ్‌బిషప్ లేఖ రాయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. 2019 ఎన్నికలను పురస్కరించుకొని దేశం కోసం ప్రార్ధన చేయాలని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖపై బిజెపి, ఆర్ఎస్ఎస్ లు తీవ్రంగా మండిపడ్డాయి.
దేశం కోసం ప్రార్థన చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రతివారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనల సందర్భంగా తప్పకుండా లేఖలో పేర్కొన్న ప్రార్థనను చదివి వినించాలని ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో తన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజకీయ కల్లోల వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆయన ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని చర్చిలను ఉద్దేశించి ఈ నెల 8న ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో రాసిన ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది.
కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం తప్పు. సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయమని మీరు చెప్పవచ్చు. కానీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓటు వేయకూడదని చెప్తూ మీకు మీరే కుహనా లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరమని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష చూపడం లేదని, ఈ నేపథ్యంలో అందరూ ప్రగతిశీల సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications