వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేర రాజధానిగా ఢిల్లీ: 10ఏళ్లలో ఢిల్లీలో అత్యాచారాలు, నేరాలు ఎంతగా పెరిగాయంటే!!

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు గణనీయంగా పెరిగాయి. మహిళలపై నేరాలే కాదు, నగరం మొత్తం మీద దారుణమైన నేరాలు కూడా నమోదయ్యాయి. 2012లో నమోదైన 2,402 కేసుల నుండి 2021 నాటికి 5,740 కేసులు నమోదయ్యాయి అంటే ఎంతగా నేరాల పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి-ప్రేరిత లాక్‌డౌన్ కారణంగా 2020లో ఢిల్లీలో నేరాల రేటు మొత్తం తగ్గినప్పటికీ, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధిక హింసాత్మక నేరాలు మరియు మహిళలపై నేరాలు జరిగినట్లు దేశ రాజధాని నివేదించింది.

10 ఏళ్లలో ఢిల్లీలో అత్యాచారాల కేసులు దాదాపు మూడు రెట్లు పెరుగుదల

10 ఏళ్లలో ఢిల్లీలో అత్యాచారాల కేసులు దాదాపు మూడు రెట్లు పెరుగుదల


2012 డిసెంబర్‌లో దేశ రాజధానిలో నిర్భయ కేసు వెలుగు చూసింది. ఆ ఏడాది నగరంలో 706 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 2021లో 2,076 నేరాలు నమోదవడంతో 10 ఏళ్లలో ఢిల్లీలో అత్యాచారాల కేసులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని ఢిల్లీ పోలీసుల అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2012 మరియు 2021 మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు మాత్రమే కాదు, వారిపై దాడి కేసులు కూడా 3.5 రెట్లు పెరిగాయని ఢిల్లీ పోలీసుల డేటా వెల్లడించింది.

2014 మరియు 2019 మధ్య ప్రతి సంవత్సరం 2,100 కంటే ఎక్కువ అత్యాచార కేసులు

2014 మరియు 2019 మధ్య ప్రతి సంవత్సరం 2,100 కంటే ఎక్కువ అత్యాచార కేసులు

ఢిల్లీ నగరంలో 2014 మరియు 2019 మధ్య ప్రతి సంవత్సరం 2,100 కంటే ఎక్కువ అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2020లో, కరోనావైరస్ కారణంగా దేశం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను చూసినప్పుడు, ఢిల్లీ నగరంలో 1,699 కేసులు నమోదయ్యాయి. 2021లో, ఈ సంఖ్య 22 శాతం కంటే ఎక్కువ పెరిగి 2,076 కేసులకు చేరుకుంది.అంతేకాకుండా, మహిళల కిడ్నాప్ 2012లో 2,048 కేసుల నుండి 2021లో 3,758కి దాదాపు రెట్టింపు అయ్యింది. అదే సమయంలో భర్త లేదా అతని బంధువుల వేధింపుల కేసులు 2,046 నుండి 4,731కి పెరిగాయి.

2012లో నమోదైన 2,402 కేసుల నుండి 2021 నాటికి 5,740 కేసులకు పెరుగుదల

2012లో నమోదైన 2,402 కేసుల నుండి 2021 నాటికి 5,740 కేసులకు పెరుగుదల


కేవలం మహిళలపై నేరాలు మాత్రమే కాదు, నగరం మొత్తం మీద దారుణమైన నేరాలు కూడా నమోదయ్యాయి. 2012లో నమోదైన 2,402 కేసుల నుండి 2021 నాటికి 5,740 కేసులు నమోదయ్యాయి. 2012లో 608 దోపిడీ కేసుల నుండి, రాజధానిలో దోపిడీ కేసుల సంఖ్య 2021 నాటికి 2,333కి పెరిగింది. 2012 మరియు 2021 మధ్యకాలంలో దోపిడీ కేసులు 28 నుండి 26కి తగ్గాయి. హత్య కేసుల సంఖ్య 521 నుండి 459కి పడిపోయింది.

ఢిల్లీ నగరంలో క్రూరమైన నేరాలు 5.5 రెట్లు పెరుగుదల

ఢిల్లీ నగరంలో క్రూరమైన నేరాలు 5.5 రెట్లు పెరుగుదల

2012లో 79 అల్లర్ల కేసులు నమోదు కాగా, 2021 సంవత్సరంలో 68 అల్లర్ల కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నగరంలో క్రూరమైన నేరాలు 5.5 రెట్లు పెరిగాయి . 2012లో దాదాపు 52,000 కేసుల నుండి గత ఏడాది 2.87 లక్షల కేసులకు పెరిగింది. 2012లో మోటారు వాహనాల దొంగతనాల కేసులు కేవలం 14,391. 2021లో ఇది 37,910కి పెరిగింది. ఇంటి దొంగతనాల కేసులు 2012లో 1,746 నుండి 2021 నాటికి 2,485కి పెరిగాయి.

 భారతదేశం యొక్క నేర రాజధానిగా ఢిల్లీ

భారతదేశం యొక్క నేర రాజధానిగా ఢిల్లీ


ఢిల్లీని భారతదేశం యొక్క 'నేర రాజధాని' గా ఢిల్లీ కనిపిస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం, నగరంలో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద నమోదైన కేసుల సంఖ్య 2019 మరియు 2020 మధ్య 18 శాతం క్షీణించింది. మొత్తంగా చూస్తే ఢిల్లీలో నేరాల రేటు పెరగటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.

English summary
Police data show that rapes in Delhi have tripled in 10 years and cases of kidnapping of women have doubled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X