హస్తినను ఏలే రాజెవరు?: అసలు జాతకం బయటపడేది అప్పుడే

Delhi Assembly election 2025: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్‌ స్థానాలకూ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పూర్తిచేసింది. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి, అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

Delhi Assembly Election 2025 Voting in all 70 seats begins

మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221.

80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు చాలామంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు.

15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు. 2020 నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడూ అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగగా భావించే ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేసే వారికి ఆయన అభినందనలను తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+