ఢిల్లీ ఎన్నికలు: విమర్శలపై ఘాటుగా కేజ్రీ, పేరు మార్చుకున్న బేడీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ధర్నాలకే పరిమితమని బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పించడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ధర్నాలు చేపట్టేది తన కోసం కాదని స్పష్టం చేశారు.

ప్రజల కోసమే ధర్నాలు చేస్తానని అన్నారు. ప్రధాని మోడీ సర్కారు నీచ రాజకీయాలు చేస్తోందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు యోచిస్తోందని, అదే జరిగితే ప్రజలనెత్తిన మరో బండ పడ్డేట్టేనని అన్నారు.

ఇక ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన' పథకంపై కూడా అరవింద్ కేజ్రీవాల్ తీవ్రవిమర్శలు చేశారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నంత మాత్రాన బతుకు బండి నడవదని, అందులో నగదు ఉండాలని అన్నారు.

Delhi Assembly polls: My new name is 'Vikaas Bedi', says Kiran Bedi

ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ వినూత్నంగా ప్రజల్లోకి వెళుతున్నారు. తన పేరును "వికాస్ బేడీగా" మార్చుకుని ఢిల్లీకి కొత్త వికాసాన్ని అందిస్తానని ట్విట్టర్లో పేర్కొంది. "యమునా నదిని ప్రక్షాళన చేసే విషయంలో హర్యానా సీఎంను కలిసినప్పుడు నా కొత్త పేరు 'వికాస్ బేడీ' అని చెప్పాను.

"ఢిల్లీలో ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా చేసే విషయంలో సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు" అని ట్వీట్ చేశారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీని కూడా దేశంతో పాటు ముందుకు తీసుకెళ్లేందుకే నేను వచ్చాను. అందుకే నా పేరుని వికాస్ బేడీగా మార్చుకున్నా అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+