వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదరగొట్టిన ఢిల్లీ కుర్రాడు: గూగుల్ భారీ ఆఫర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్ధికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ప్లేస్‌మెంట్స్ హడావుడి కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన చేతన్ కక్కర్ అనే విద్యార్ధికి ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీ గూగుల్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గూగుల్ తనకు ఏడాదికి 1.27 కోట్ల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేసినట్టు చేతన్ కక్కర్ చెప్పారు.

ఢిల్లీకి చెందిన చేతన్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో ఫైనలియర్ చదువుతున్నారు. చేతన్ కోర్సును పూర్తి చేశాక వచ్చే ఏడాది కాలిఫోర్నియాలో గూగుల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నాడు.

Delhi boy grabs whopping Rs 1.27 crore pay offer from Google

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్ అందుకున్న విద్యార్థి చేతన్ కావడం విశేషం. చేతన్‌కు ముందు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అత్యధిక వేతన ఆఫర్ రూ. 93 లక్షలు మాత్రమే.

గూగుల్ సంస్థలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నానని చేతన్ సంతోషం వ్యక్తం చేశారు. చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు. తల్లి రీతా కెమిస్ట్రీ విభాగంలో, తండ్రి సుభాష్ మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగంలో పనిచేస్తున్నారు.

English summary
Google has made a whopping placement offer to a student of the Delhi Technological University (DTU). As per the Times of India, Delhi's Chetan Kakkar has been given an offer of $1,90,000 (Rs 1.26 crore approx) per annum from the search giant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X