సీఎం జట్టు పట్టుకుని లాగి, చెంప ఛెళ్లుమనిపించి..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలతో ముఖాముఖి (Jan Sunwai) సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తం రేఖా గుప్తాపై దాడి చేసినట్లు ప్రాథమకంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ రేఖా గుప్తా ప్రతివారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉదయం 9 గంటలకు ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

అదే సమయంలో- 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి దాడికి దిగాడు. తొలుత ఓ వినతిపత్రాన్ని రేఖా గుప్తాకు అందించారు. తన సమస్యలను చెప్పుకొన్నాడు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదని వాపోయాడు. దీనికి అధికార యంత్రాంగం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో, హఠాత్తుగా అతను రేఖా గుప్తాపై దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగినట్లు కూడా తెలుస్తోంది. ఈ అనూహ్య ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. అతని వివరాల గురించి ఆరా తీస్తోన్నారు.
అతన్ని తనిఖీ చేయగా.. కోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభించాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఢిల్లీ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని పేర్కొంది.
ఈ దాడిలో ముఖ్యమంత్రికి తలకు గాయం అయిందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటన పట్ల బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ విమర్శలు గుప్పించారు. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో ఆరా తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.












Click it and Unblock the Notifications