కేజ్రీపై తగ్గని హజారే: మోడీని పిల్చి సోనియాకి నో, ఢిల్లీపై అమెరికా మౌనం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా ఇవ్వాలని కేజ్రీ హోంమంత్రిని కోరారు. రాజ్‌నాథ్‌ను కలిసిన అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రంతో తాము సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

జెడ్ ప్లస్ కేటగిరీకి నిరాకరణ

కేజ్రీవాల్ తనకు ఇచ్చిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఏఏపీ నేత మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఈ నెల 14న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, దానికి తాము రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించామని చెప్పారు.

Delhi CM-designate Arvind Kejriwal meets Home Minister Rajnath Singh

మోడీ అండ్ కోకు ఆహ్వానం, సోనియాకు నో

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, అన్నాహజారే, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తదితరులను ఏఏపీ ఆహ్వానించింది. అయితే, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఆహ్వానించలేదు.

అన్నా హజారే నో

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి సామాజిక సంస్కర్త అన్నాహజారేను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానించింది. అయితే, కేజ్రీవాల్ విజ్ఞప్తిని అన్నాహజారే తిరస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పైన అన్నాహజారే మండిపడ్డ విషయం తెలిసిందే. గతంలో తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు తనను ఆహ్వానించలేదన్నారు.

ఢిల్లీ ఫలితాలపై అమెరికా మౌనం

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలకు అంతర్జాతీయ పత్రికలు కూడా ప్రాధాన్యతను ఇచ్చాయి. అయితే, అమెరికా ఈ అసాధారణ విజయం పైన మాట్లాడేందుకు నిరాసక్తత వ్యక్తం చేసింది. అమెరికన్ అధికార ప్రతినిధి జెన్ సాకీని విలేకరులు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రశ్నించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఫలితాలపై మాట్లాడకపోవడానికి తమ వద్ద ప్రత్యేక కారణాలు లేవని, అది అంతర్జాతీయ అంశం కాదని, భారత్ అంతర్గత వ్యవహారమని, తాము భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+