రాహుల్ గాంధీకి గుడ్ న్యూస్- మూడేళ్ల పాస్ పోర్టుకు ఢిల్లీ కోర్టు ఓకే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాధారణ పాస్ పోర్టు తీసుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. నిన్న మొన్నటి వరకూ ఎంపీగా ఉంటూ దౌత్య పాస్ పోర్టు కలిగి ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవికి అనర్హుడిగా మారిన తర్వాత దాన్ని వదిలిపెట్టి సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం కోర్టుల్లోకి చేరింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
తాను సాధారణ పాస్ పోర్టు తీసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంభ్యతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుని అశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ప్రభుత్వ వాదన కూడా తెలుసుకున్న తర్వాత రాహుల్ గాంధీకి సాధారణ పాస్ పోర్టు తీసుకునేందుకు మూడేళ్ల పాటు ఎన్వీసీ జారీ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.

వాస్తవానికి సాధారణ పాస్ పోర్టు తీసుకోవడానికి తనకు పదేళ్ల పాటు ఎన్వోసీ ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరినా.. కోర్టు మాత్రం మూడేళ్ల పాటు మాత్రమే అనుమతించింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రాహుల్ గాంధీ పాస్ పోర్టు తీసుకోనున్నారు. అటు రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఇవాళ్టి లోగా సమాధానం ఇవ్వాలని సుబ్రమణ్య స్వామిని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అంతకుముందు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని తెలిపారు. అనుమతి లేకుండా అనేక సార్లు ప్రయాణించిన రాహుల్ గాంధీ కదలికపై కోర్టులు ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
2015 డిసెంబరులో రాహుల్ గాంధీ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు.. కోర్టు అతని ప్రయాణంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించాలంటూ స్వామి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈసారి కూడా రాహుల్ ప్రయాణంపై ఎలాంటి ఆంక్షలు లేనందున పాస్ పోర్టు తీసుకునేందుకు కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications