ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్‌కు భారీ షాక్: హత్యానేరం అభియోగాలు నమోదు
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ రెజ్లర్ హత్య కేసులో అరెస్టయిన సుశీల్ కుమార్‌పై ఢిల్లీ కోర్టు బుధవారం హత్యా నేరం అభియోగాలు నమోదు చేసింది. హత్య, హత్యాయత్నం, దౌర్జన్యంతోపాటు చట్ట విరుద్ధమైన సమావేశం తదితర అభియోగాలను మోపింది.
సుశీల్ తోపాటు 17 మందిపైనా అభియోగాలు నమోదు చేసింది. పరారీలో ఉన్న మరో ఇద్దరినీ ఈ జాబితాలో చేర్చింది. గత సంవత్సరం మే 4న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో యువ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్టేడియంలో ఘర్షణకు సుశీల్ కుమార్ కుట్ర పన్నాడని, ఆపై సాగర్‌పై దాడి చేసి హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు తమ ఛార్జ్ షీటులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటి అద్దె విషయంలో సుశీల్ కుమార్‌కు , సాగర్‌కు గతంలో గొడవలు జరిగాయని.. సాగర్‌పై ఆధిపత్యం చెలాయించేందుకే సుశీల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత పరారీలో ఉన్న సుశీల్ కుమార్ ను మూడు వారాల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సుశీల్ తీహార్ జైలులో ఉన్నాడు. కాగా, ఘటన జరిగిన తర్వాత సాగర్‌పై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications