సోనియా, రాహుల్‌కు కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్(National Herald Case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ ను పరిగణోకి తీసుకోలేమని.. అందుకే, విచారణకు హజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఇటవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
అయితే, గత వారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేని కారణంగా సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

ఛార్ఝీషీట్‌పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. దానిలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ సహా పలువురి పేర్లను పేర్కొంది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారని ఫిర్యాదులు రావడంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. సీబీఐ విచారణ మధ్యలోని ఆగిపోయినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో 2023, నవంబర్ లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్న్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపట్టింది.
ఆస్తులు ఉన్న ప్రాంతాలై ఢిల్లీ, ముంబై, లక్నోలోని సంబంధిత భవనాలకు నోటీసులు అంటించింది. కాంగ్రెస్ ఎంపీలు సోనియా, రాహుల్ తోపాటు ఆ పార్టీ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications