కీచక బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు- రెజ్లర్లపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆదేశాలు..
భారత రెజ్లింగ్ సమాఖ్య ఛీఫ్ పదవిలో ఉంటూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఇవాళ ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. రెజ్లర్లపై వేధింపుల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకూ ఈ కేసులో పోలీసుల తీరుపై ఎదురవుతున్న విమర్శలకు కోర్టు సమాధానం ఇచ్చినట్లయింది.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీలోని కోర్టు ఆయనకు ఇవాళ సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో ఢిల్లీ పోలీసుల చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. బ్రిజ్ భూషణ్ సింగ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఫిర్యాదులు నమోదు చేశారు.
డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో ఆయన అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం వంటి చేష్టలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ సింగ్‌పై జూన్ 15న సెక్షన్ 354 (మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం, 354A (లైంగిక వేధింపులు), 354డి (వెంబడించడం) IPC యొక్క 506 (నేరపూరిత బెదిరింపు) వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఢిల్లీ కోర్టు సమన్లు ఇచ్చింది.












Click it and Unblock the Notifications