ఢిల్లీలో భూ ప్రకంపనాలు.. జనం భయాందోళన... బయటకు పరుగులు
దేశ రాజధాని ఢిల్లీ భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. నాంగ్లొలి ప్రాంతంలో ఉదయం 5.02 గంటలకు భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాంగ్లొలితోపాటు ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైందని జాతీయ సిస్మాలజీ కేంద్రం అధికారులు చెప్పారు.

భూప్రకంపనలతో తెల్లవారుజామున ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం త్వరగా బయటకు రారు. భూ ప్రకంపనాలతో బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. డిసెంబరు 17వతేదీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్‌లోనూ గత రాత్రి భూమి కంపించింది.












Click it and Unblock the Notifications