నాకు 130 మంది బలం, మోడీకి ఢిల్లీ తర్వాత బీహారే: నితీష్ సవాల్
పాట్నా: బీహార్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తనకు మద్దతుగా 130 మంది ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీష్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ త్రిపాఠి నుండి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యేలతో కలిసి తాము డిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తున్నట్లు చెప్పారు.

వేచిచూసే ధోరణిలో బీజేపీ
బీహార్ రాజకీయ అనిశ్చితి పైన భారతీయ జనతా పార్టీ వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
బీహార్‌లో బలాబలాలు...
మొత్తం స్థానాలు : 243... ఖాళీలు : 10
సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ : 117
జేడీ(యూ) కూటమి : 147
జేడీయూ (115), ఆర్జేడీ(24), కాంగ్రెస్(5), సీపీఐ(1), స్వతంత్రులు(2)
బీజేపీ కూటమి: 90
బీజేపీ(87), స్వతంత్రులు(3)
నితీశ్ 130 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ అందజేశారు.
మాంఝీ తనకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు.
ఢిల్లీ ఎన్నికల పైన నితీష్ కుమార్ స్పందన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైన నితీష్ కుమార్ స్పందించారు. ప్రధాని మోడీ పాలనకు ఢిల్లీ ఎన్నికలు రిఫరెండం అన్నారు. ఇక నెక్స్ట్ బీహార్ అన్నారు. దేశానికి గుండెకాయ వంటి ఢిల్లీలో బీజేపీ ఓటమి ప్రజల ఆలోచనలను తెలియజేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications