వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా బిడ్డ రాత్రి తిరిగితే..: నిర్భయపై లాయర్ కాంట్రవర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

AP Singh
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశ్కిష పడిన దోషుల్లో ఇద్దరి తరఫున వాదించిన న్యాయవాది ఎపి సింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురే గనుక పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని రాత్రి పూట బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ ఉంటే ఆమెను సజీవంగా తగులబెట్టి ఉండేవాడిని' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పలు స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు తీవ్ర అభ్యంతరం చేస్తూ ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీ బార్ కౌన్సిల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సింగ్ సమాధానం ఇస్తూ.. ‘ఒకవేళ నా కూతురే గనుక పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రి పొద్దుపోయే దాకా తిరుగుతూ ఉంటే ఆమెను సజీవ దహనం చేసి ఉండేవాడిని.. ఇలాంటి పరిస్థితి రానిచ్చి ఉండేవాడిని కాదు.. తల్లిదండ్రులందరు కూడా ఇలాంటి వైఖరినే అనుసరించాలి' అని పరోక్షంగా డిసెంబర్ 16నాటి ఘటనలో బాధితురాలయిన 23 ఏళ్ల యువతినుద్దేశించి అన్నారు.

సింగ్ ప్రకటనను ఖండిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల నుంచి తమకు నోటిమాటగా ఫిర్యాదులు అందుతున్నాయని, బార్ కౌన్సిల్ కార్యదర్శి మురళీ తివారీ చెప్పారు. ఫిర్యాదులను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరానని, ఒకవేళ లిఖితపూర్వక ఫిర్యాదులు అందని పక్షంలో ఈ నెల 20న జరిగే బార్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలే తనకు తానుగా ఈ అంశంపై చర్చిస్తుందని ఆయన చెప్పారు.

ఢిల్లీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్ ఖత్రి కూడా సింగ్ ప్రకటనను ఖండిస్తూ, ఏ న్యాయవాది కూడా ఇలాంటి ప్రకటన చేయడం సరికాదని అన్నారు. లాయర్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

English summary
AP Singh, the defence lawyer in the Delhi gang rape case, reportedly said on Saturday that he would have burned his daughter were she to step out at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X