ట్విట్టర్ కు రక్షణ కల్పించలేం -తేల్చేసిన ఢిల్లీ హైకోర్టుృ-ఐటీ రూల్స్ పాటించకపోతే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనల్ని అమలు చేసేందుకు నిరాకరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు ఇవాళ భారీ షాకిచ్చింది. కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల్ని పాటించకపోతే చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని హైకోర్టు ట్విట్టర్ ను హెచ్చరించింది. అటు కొత్త ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ట్విట్టర్ కు ఇవాళ హెచ్చరికలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ట్విట్టర్ కు అక్కడా ఊరట దక్కడం లేదు. ఐటీ రూల్స్ పాటించేందుకు ట్విట్టర్ చెప్తున్న కారణాల్ని ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు. కేంద్రం కోరుతున్న విధంగా ఐటీ రూల్స్ అమలు పర్యవేక్షణాధికారుల్ని కూడా నియమించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. తాజాగా ట్విట్టర్ తాత్కాలిక అధికారుల్ని నియమించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వారిని తమకు అప్పగించిన బాద్యతలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

కేంద్రం కోరుతున్న విధంగా ఐటీ చట్టాల అమలు అధికారుల్ని నియమించేందుకు ట్విట్టర్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును 8 వారాల గడువు కోరింది. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం కేంద్రం చర్యలు తీసుకోకుండా ట్విట్టర్ కు ఎలాంటి ప్రత్యేక రక్షణ కల్పించలేమని మొన్న స్పష్టం చేసింది. ఇవాళ అదే విషయాన్ని మరోసారి తెలియజేసింది. తాము ఐటీ రూల్స్ అమలు చేయకపోతే ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని సంస్ధ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
అటు రవిశంకర్ ప్రసాద్ స్ధానంలో కొత్త ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ కూడా వచ్చీరావడంతోనే ట్విట్టర్ ను టార్గెట్ చేశారు. ఇవాళే ఐటీ మంత్రిగా బాధ్యలు చేపట్టిన ఆయన.. ఈ గడ్డిపై ఉండాలంటే ఇక్కడి రూల్స్ పాటించాల్సిందేనని ట్విట్టర్ కు సూచించారు. మాజీ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ విషయంలో మెతగ్గా వ్యవహరించారని, ఈ వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని భావించిన ప్రధాని మోడీ ఆయనకు ఉద్వాసన పలికారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కొత్త ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications