ఢిల్లీ మసీదులో కరోనా వ్యాప్తి కేసుపై హైకోర్టు సంచలన తీర్పు..!

2020లో కరోనా వ్యాప్తి ఆరంభదశలో ఉన్న సమయంలో ఢిల్లీలోని ఓ మసీదులో తబ్లిగీ జమాత్ ముస్లింలు సమావేశమయ్యారు. కోవిడ్ ఆరంభమైన తర్వాత ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో వారు ఆ మసీదులోనే ఉండిపోయారు. తద్వారా ఎంతో మందికి కోవిడ్ వ్యాప్తి కావడానికి కారణమయ్యారన్న ఆరోపణలతో 70 మందిపై వివిధ సెక్షన్ల కింద 16 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఐదేళ్లుగా సాగుతున్న విచారణ ముగించిన ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది.

ఢిల్లీ మసీదులో తబ్లిగీ జమాత్ సభ్యులు సమావేశమై కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తేల్చేసింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన 16 కేసుల్ని కొట్టేసింది. ఈ కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న 70 మంది ముస్లింలకు విముక్తి లభించినట్లయింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ బహిరంగ కోర్టులో విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

delhi high court quashes Tablighi jamaat covid spread case after five years relief to 70 muslims

ఇస్లాంలోని తబ్లిగీ జమాత్ కు చెందిన 70 మంది సభ్యులపై 2020 మార్చి 24, మార్చి 30 మధ్య కోవిడ్ సమయంలో విదేశీ పౌరులను వేర్వేరు మసీదులలో ఉంచారని ఆరోపిస్తూ 16 కేసులు నమోదు చేశారు. 70 మంది నిందితులపై నేరపూరిత కుట్రతో సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఎఫ్ఐఆర్లలో 195 మంది విదేశీ పౌరుల పేర్లు కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వారందరికీ విముక్తి లభించింది.

అప్పట్లో కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని వీరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఢిల్లీలోని మర్కజ్ మసీదు వద్ద జరిగిన జమాత్ సమావేశంలో పాల్గొనడం ద్వారా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రభుత్వం 950 మందికి పైగా విదేశీ పౌరులను బ్లాక్ లిస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో అప్పట్లో పోలీసులు తీసుకున్న చర్యల్లో పస లేదని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+