ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం షాక్, నీటి వాడకం 20వేల లీటర్లు దాటితే పన్ను బాదుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర వాసులకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం షాకిచ్చింది. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడే నగర ప్రజలను కొత్త సంవత్సరంలో ఆందోళనలో పడేసింది.
నీటి వినియోగంపై పన్నులు పెంచాలని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నీటి వినియోగంపై పన్నును విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

తాజా ఆదేశాల ప్రకారం ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల వినియోగ పరిమితి మించితే బాదుడు తప్పదు. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల పరిమితి దాటితే 20 శాతం పన్ను చెల్లించాలి. నెలకు 20వేల లీటర్ల వినియోగం టారిఫ్‌లో ఎలాంటి మార్పులు లేవు.












Click it and Unblock the Notifications