భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ వర్షానికి తోడు.. ఈదురుగాలులతో కూడిన దుమ్ము తుఫాన్ చెలరేగింది. దీని ప్రభావంతో నగరం వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ఈదురుగాలుల తీవ్రతకు నజాఫ్‌గఢ్‌లో ఓ భారీ చెట్టు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో 26 ఏళ్ల జ్యోతి అనే మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అజయ్‌ మాత్రం స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

రెడ్ అలర్ట్ జారీ..

మరోవైపు భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం వరకు ఉరుములతో కూడిన వానలు, తీవ్ర ఈదురుగాలులు ఉంటాయని హెచ్చరిక జారీ చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

delhi-lashed-by-heavy-rains-and-four-dead

ఇక ఇప్పటికే భారీ వర్షాల ధాటికి ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్.. మోతీ బాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఈదురుగాలులకు చెట్లు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యగా మారింది.

విమాన రాకపోకలకు అంతరాయం..

తుఫాన్ ప్రభావంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా నీరు చేరింది. దాదాపు 100కి పైగా విమానాలు ఆలస్యమవుతున్నట్లు విమాన సంస్థలు ప్రకటించాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఢిల్లీలో ల్యాండ్ కావాల్సిన రెండు విమానాలలో ఒకటి జైపూర్‌కు, మరొకటి అహ్మదాబాద్‌కు మళ్లించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+