ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఏడు రోజుల ఈడీ కస్టడీ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా ఊరట లభించలేదు.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా ప్రత్యక్ష పాత్రే అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ప్రస్తుతం సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ బెయిల్ పిటిషన్ పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. సిసోడియాను 10 రోజులపాటు(మార్చి 17 వరకు) తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియాను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కోర్టులో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి.. నిపుణుల కమిటీ అభిప్రాయాలను పక్కనబెట్టి.. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా కొత్త లిక్కర్ పాలసీని రూపొందించారు. కొందరు హోల్‌సేల్ డీలర్లకు 12 శాతం లాభం ఉండేలా పాలసీని తయారు చేశారు అని ఈడీ పేర్కొంది.

అంతేగాక, సిసోడియా ఆదేశాలతోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని ఈడీ తెలిపింది. ఈ లిక్కర్ పాలసీలోని కొన్ని అంశాలను మంత్రుల బృందం సమావేశంలో కనీసం చర్చించలేదు. అయినా పాలసీని ఆమోదించి అమల్లోకి తెచ్చారు. ఇలా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా ఛానళ్ల ద్వారా దారి మళ్లించారు. ఈ మనీలాండరింగ్‌లో సిసోడియా కూడా ఓ భాగమేనని కోర్టుకు ఈడీ వివరించింది.
ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారం సిసోడియా ఫోన్ అని.. అయితే దాన్ని ఆయన ధ్వంసం చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. సిసోడియా విచారణకు సహకరించలేదని.. పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. అయితే, ఈడీ కస్టడీ అభ్యర్థనను సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయడం తమ హక్కుగా భావిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బు ఈడీ గుర్తించలేదని.. అయినా లిక్కర్ పాలసీపై దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. కేవలం చెప్పుడు మాటల ఆధారంగానే సిసోడియాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల అరెస్టులపై కోర్టులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియాను ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 21కి సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications