ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఈడీ దూకుడు.. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు అరెస్ట్!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేయగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల్లో ఒకరైన మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని నేడు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన మరో మద్యం వ్యాపారి విజయ్ నాయర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు ను అరెస్ట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో మద్యం వ్యాపారి అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో మద్యం వ్యాపారి అరెస్ట్


ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితులకు సమీర్ మహేంద్రు ద్వారా రెండుసార్లు నగదు చెల్లింపులు జరిగినట్లు ఇండోస్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అమలులో లేని ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారుల్లో మహేంద్రూ ఒకరు అని ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన పేరును చేర్చారు.

మనీష్ సిసోడియా సన్నిహితులకు నగదు బదిలీ చేసిన సమీర్ మహేంద్రు

మనీష్ సిసోడియా సన్నిహితులకు నగదు బదిలీ చేసిన సమీర్ మహేంద్రు

సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్‌కు సమీర్ మహేంద్రు కోటి రూపాయలను బదిలీ చేసినట్లు సిబిఐ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. అంతేకాకుండా, సిసోడియాకు మరో సన్నిహితుడు అర్జున్ పాండే, విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు నుంచి దాదాపు రూ.2 నుంచి 4 కోట్లు వసూలు చేసినట్లు సీబీఐ తెలిపింది.

విజయ్ నాయర్ .. సమీర్ మహేంద్రు నుండి నగదు తీసుకున్నట్టు ఆధారాలు

విజయ్ నాయర్ .. సమీర్ మహేంద్రు నుండి నగదు తీసుకున్నట్టు ఆధారాలు

విజయ్ నాయర్ ద్వారా లంచం తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులకు అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు నుండి అనవసరమైన డబ్బును వసూలు చేసేవాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. విజయ్ నాయర్ తరపున అర్జున్ పాండే అనే వ్యక్తి ఒకసారి సమీర్ మహేంద్రు నుండి 2-4 కోట్ల రూపాయల భారీ నగదును వసూలు చేశాడు అని సిబిఐ తెలిపింది.

మనీష్ సిసోడియాతో పాటు లిక్కర్ స్కామ్ లో సమీర్ మహేంద్రు పేరు

మనీష్ సిసోడియాతో పాటు లిక్కర్ స్కామ్ లో సమీర్ మహేంద్రు పేరు

ఈ కేసులో నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా మరియు ఇతర పబ్లిక్ సర్వెంట్లు 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను సంబంధిత శాఖల ఆమోదం లేకుండానే టెండర్ తర్వాత లైసెన్సుదారులకు అనవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకున్నారని సీబీఐ ఎఫ్ఐఆర్ పేర్కొంది. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియాతో సహా మొత్తం 15 మంది పేర్లు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సూచన ఆధారంగా ఎఫ్‌ఐఆర్ రూపొందించబడింది.

ఇప్పటికే సమీర్ మహేంద్రును ప్రశ్నించిన సీబీఐ .. నేడు ఈడీ అరెస్ట్

ఇప్పటికే సమీర్ మహేంద్రును ప్రశ్నించిన సీబీఐ .. నేడు ఈడీ అరెస్ట్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవినీతికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతర నిందితులతో పాటు ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రూను సీబీఐ ఆగస్టు 22న ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజాగా ఈడీ అధికారులు సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+