విమానంలో మహిళతో అసభ్యంగా, బిజినెస్‌మెన్ అరెస్ట్
ఢిల్లీ: ఇండిగో విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిని వేధించాడనే ఆరోపణలతో ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో విమానం సిద్ధమైంది.
సిబ్బంది సూచనతో సీటు బెల్టు పెట్టుకున్న వెంటనే ఓ మహిళ ఉన్నట్లుండి గట్టిగా అరిచింది. దీంతో బయలుదేరాల్సిన విమానాన్ని సిబ్బంది ఆపింది. సిబ్బంది వెళ్లి ఏమయిందని ప్రశ్నించారు. తనను పక్క సీట్లో కూర్చున్న తోటి ప్రయాణీకుడు సంజయ్ కనద్ లైంగికంగా వేధించాడని చెప్పింది.

దీంతో వారిద్దరినీ సిబ్బంది కోల్‌కతా విమానాశ్రయంలో దించారు. ఆ తర్వాత ఆ విమానం బయలుదేరింది. దీని పైన విచారణ జరిపిన ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సంజయ్‌ను అరెస్టు చేశారు. సంజయ్ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications