ఆ మలయాళీ నర్సులకు అండగా కేటీఆర్: ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న మెడికల్ కాలేజ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్‌ను దేశ రాజధానిలోని గోవింద్ వల్లభ్‌పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెనక్కి తీసుకుంది. ఆ సర్కులర్ తమకు తెలియకుండా జారీ అయినట్లు ఆ ఇన్‌స్టిట్యూట్ పరిపాలన విభాగం వెల్లడించింది. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

జీబీ పంత్ వైద్య కళాశాలలో కేరళకు చెందిన నర్సులు పెద్ద సంఖ్యలో పనిచేస్తోన్నారు. కొందరు స్టాఫ్‌నర్సులుగా ఉన్నారు. సాధారణంగా వారంతా తమ మాతృభాష మలయాళంలోనే సంభాషిస్తుంటారు. దీనిపట్ల వైద్య కళాశాల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మలయాళంలో మాట్లాడకూడదని ఆదేశించారు. హిందీ/ఇంగ్లీష్‌లోనే సంభాషించాలంటూ సర్కులర్‌ను జారీ చేశారు. దీనిపట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. కేరళకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి పలువురు నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Delhi Medical college withdraws its circular to communicate only in Hindi or English

అంకిత భావంతో సేవలందించే కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, వారిని, వారి సేవలను, వారి మాతృభాష కించపరిచేలా జీబీ పంత్ ఆసుపత్రి అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు. పలు విదేశాలు కూడా కేరళ నర్సుల వైద్య సేవలను వినియోగించుకుంటోన్నాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో మలయాళంలో మాట్లాడొద్దంటూ కేరళ నర్సులకు ఆదేశాలు జారీ చేయడంలో అర్థం లేదని అన్నారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయని కేటీఆర్ ఆ ఆసుపత్రి అధికారులకు గుర్తు చేశారు.

దేశ ప్రజలు తమకు ఇష్టమైన భాషలో, మాతృభాషలో సంభాషించే అధికారం రాజ్యాంగం కల్పించిందని కేటీఆర్ అన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఇచ్చిన ఆదేశాలపై మలయాళీలు భగ్గుమంటోన్నారు. తమ మాతృభాషలో మాట్లాడుకోవద్దంటూ ఆదేశాలివ్వడానికి ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య భారతావనిలో మాతృభాషలో మాట్లాడొద్దని ఆదేశాలివ్వడమేంటని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+