వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై వెంకయ్య ప్రశంసలు, నాయుడు సూపర్అని ప్రధాని(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ చూసినా ఒకటే నినాదం ప్రతిధ్వనిస్తోందని, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, నలు దిశలా జనం మోడీ.. మోడీ అని నినదిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు.

మోడీ అంటే త్రీడీ అని అభివర్ణించారు. డెసిసివ్‌ (నిర్ణాయాత్మక), డైనమిక్‌ (చురుకైన), డెవలప్‌మెంట్‌ (అభివృద్ధి) అని మూడు డీలకు నిర్వచనం చెప్పారు.

మోడీలోని త్రీడీ లక్షణాలను చూసే ఏడునెలల క్రితం దేశప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీని గెలిపించారని, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో విజయం సాధించిన సందర్భగా ఆ మూడు రాష్ట్రాల సీఎంలను పిలిచి ఏర్పాటు చేసిన అభినందన్‌ సభలో వెంకయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మోడీ - వెంకయ్య

మోడీ - వెంకయ్య

తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఉర్రూతలూగించారు. వెంకయ్య ప్రయోగించిన ప్రాసలు, ప్రతిపక్షాలపై రువ్విన విసుర్లకు జనం నుంచి మంచి ప్రతిస్పందన లభించింది.

మోడీ - వెంకయ్య

మోడీ - వెంకయ్య

గత 15, 20 సంవత్సరాల్లో ప్రభుత్వాలు చేయలేని పని తాము ఏడు నెలల్లోనే చేశామన్నారు. ఢిల్లీలో అన్ని ప్రాంతాల ప్రజలు లక్షలాదిగా ఉన్నారని, ఢిల్లీ దేశానికి దిల్‌(గుండెకాయ) వంటిదన్నారు.

 మోడీ - వెంకయ్య

మోడీ - వెంకయ్య

దేశ రాజధాని ఢిల్లీలో మాఫియా రాజ్యం నడుస్తోందని, ఈ మాఫియా రాజ్యాన్ని నిర్మూలిస్తామన్నారు. ఢిల్లీ నుంచి మొత్తం ఏడు ఎంపీ సీట్లు బీజేపీకి లభించాయని, అది మోడీ ప్రధాని కావడానికి ఎంతో దోహదం చేసిందన్నారు.

మోడీ - వెంకయ్య

మోడీ - వెంకయ్య

ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెంకయ్య పైన ప్రశంసలు కురిపించారు. ఏపీ వారైనా ఢిల్లీపై దిల్ అన్నారు. దేశ రాజధాని ప్రగతికి బాటలు వేశారన్నారు. ఢిల్లీకి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై ఆయకున్న పరిజ్ఢాన అపారమన్నారు.

మోడీ - వెంకయ్య

మోడీ - వెంకయ్య

దేశ రాజధాని ఢిల్లీని సమూలంగా మార్చేందుకు పట్టణాభివృద్ధి మంత్రిగా కొద్ది వ్యవవధిలోనే పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునేవారెవరికైనా వెంకయ్య ఒక సజీవ ఉదాహరణ అన్నారు.

English summary
Delhi needs a govt which is ready to work with Centre, says Venkaiah Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X