దినకరన్ భార్య అనురాధ మెడకు లంచం కేసు: పిచ్చి చేష్టలకు దిమ్మతిరిగింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పీకల్లోతుల్లో మునిగిపోయాడు. అతనితో పాటు ఆయన భార్య, సన్నిహితులు ఇప్పుడు పోలీసుల విచారణ ఎదుర్కొంటూ నానా ఇబ్బందులకు గురైనారు.

డిప్రెషన్‌‌లో శశికళ: జైల్లో క్షీణించిన ఆరోగ్యం, ఆస్తుల కోసం బంధువుల ఒత్తిడి!

రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల యంత్రాగానికికే రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తు టీటీవీ దినకరన్, అతని అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ తో సహ టీటీవీ దినకరన్, మల్లికార్జున తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు.

Delhi police grilled Dinakaran's wife Anuradha on foreign investments.

ఇప్పుడు టీటీవీ దినకరన్ భార్య అనురాధను విచారించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఏక్షణంలో ఐనా అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేశారు. విదేశాల నుంచి మీరు ఏవిధంగా నగదు లావాదేవీలు నిర్వహించారు, విదేశాల్లో పెట్టుబడులు ఎలా పెట్టారు అంటూ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ భార్య అనురాధను ప్రశ్నించారు.

టీటీవీ దినకరన్ సీన్ విజయవాడకు: ఆంధ్రా నాయకుల కోసం వేట, పరుగో పరుగు!

ఈ కేసులో విదేశాల నుంచి నగదు లావాదేవీలు జరిగాయని పోలీసులు ఆధారాలు సేకరించారు. విదేశీ లావాదేవీల ఉచ్చు ఇప్పుడు టీటీవీ దినకరన్ భార్య అనురాధ మెడకు చుట్టుకుంది. టీటీవీకి సన్నిహితుడైన న్యాయవాది గోపీకి ఇప్పటికే సమన్లు జారీ చేసిన పోలీసు అధికారులు విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police grilled TTV Dinakaran's wife Anuradha on foriegn investments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి