ఆ దారిలో జిగ్నేష్ మేవానీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు నో
న్యూఢిల్లీ: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ర్యాలీకి పార్లమెంటు స్ట్రీట్‌లో అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సోమవారం తెలిపారు. జనవరి 9న పార్లమెంటు స్ట్రీట్‌లో మేవానీ ర్యాలీకి నిర్ణయించారు. కానీ దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
నిర్వాహకులు తమ ర్యాలీకి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. 2017లో ఎన్జీటీ జంతర్ మంతర్ వద్ద అన్ని రకాల ధర్నాలు, ఆందోళనలను బ్యాన్ చేసింది. పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా, సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మేవానీ, అస్సాం ప్లీసాంట్ లీజర్ అఖిల్ గొగోయ్‌ల నేతృత్వంలో జనవరి 9న ర్యాలీకి నిర్ణయించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు రానున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications