నుపుర్ శర్మ కామెంట్ల చిచ్చు-చివరికి తాలిబన్లూ క్లాస్ పీకేస్తున్నారు-భద్రత పెంచిన కేంద్రం
మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చిచ్చు రేపుతున్నాయి. భారత్ ను పల్లెత్తుమాట అనేందుకు జంకే పశ్చిమాసియా దేశాలతో పాటు ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలు కూడా ఇప్పుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆప్ఘన్ లో తాలిబన్ల సర్కార్ ఈ మేరకు భారత్ ను క్లాస్ పీకుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ .. పవిత్రమైన ఇస్లాం మతాన్ని అవమానించేలా, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టేలా ఇలాంటి మతోన్మాదులను అనుమతించవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. "భారత్‌లోని అధికార పార్టీకి చెందిన ఒక అధికారి ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై కించపరిచే పదాలను ఉపయోగించడాన్ని ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్ తీవ్రంగా ఖండిస్తుంది" అని ఆయన అన్నారు.ఇప్పటి వరకు, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, జోర్డాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా వంటి 14 దేశాలు నుపుర్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి.

మరోవైపు ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముజాహిదీన్ ఘజ్వాతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. "ఆమె ప్రకటనను వెనక్కి తీసుకుని ప్రపంచం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని నూపుర్ శర్మను ఆదేశించామని, లేకుంటే ప్రవక్తను అవమానించే ధైర్యం చేసేవారికి తామే చేస్తామో చూపిస్తామని ముజాహిదీన్ ఘజ్వతుల్ హింద్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోరీసులు నుపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications