వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shraddha: శ్రద్దా హత్య కేసులో కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించిన పోలీసులు, ఎన్ని వేల పేజీలు అంటే !

ప్రియుడు అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను 35 ముక్కలుగా చేసి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. శ్రద్ధా వాకర్ అలియాస్ శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కోర్టుకు కొన్ని వేల పేజీల ఛార్జ్ షీట్ సమర్పించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ శ్రద్దా హత్య కేసు ఓ కొలిక్కి వస్తోంది. ప్రియుడు అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను 35 ముక్కలుగా చేసి అతి దారుణంగా హత్య చేసి విషయం తెలిసిందే. శ్రద్ధా వాకర్ అలియాస్ శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కోర్టుకు కొన్ని వేల పేజీల ఛార్జ్ షీట్ సమర్పించారు. శ్రద్దా హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారం చార్జిషీటులో పోలీసులు దాఖలు చేశారని వెలుగు చూసింది. రు. ఆ ఛార్జిషీటులో నిందితుడు అఫ్తాబ్‌పై పలు ఆరోపణలు చేశారు. అయితే అఫ్తాబ్ అతని న్యాయవాదిని మార్చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.

Wife: అబ్బా, ప్రియుడికి మిల్క్ పౌడర్, భర్తకు వాషింగ్ పౌడర్, ఎంత ప్రేమించాడంటే, సినిమా చూపించింది !Wife: అబ్బా, ప్రియుడికి మిల్క్ పౌడర్, భర్తకు వాషింగ్ పౌడర్, ఎంత ప్రేమించాడంటే, సినిమా చూపించింది !

ఇన్ని రోజుల తరువాత చార్జ్ షీట్

ఇన్ని రోజుల తరువాత చార్జ్ షీట్

శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 75 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ సమర్పించారు. పోలీసులు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించి, పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించి, అనేక రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి చార్జ్ షీట్ తయారు చేశారు. పోలీసుల విచారణ సమయంలో అఫ్తాబ్ తన న్యాయవాదికి ఛార్జ్ షీట్ చూపించకూడదని, కానీ కాపీని తనకు అందుబాటులో ఉంచాలని పోలీసులకు మనవి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు అఫ్తాబ్ రిమాండ్ గడువు పొడగించాడు. ఫిబ్రవరి 7వ తేదీ తరువాత హఫ్తాబ్ కు చార్జ్ షీట్ అందించే అవకాశం ఉందని తెలిసింది.

తెలివిగా ప్రవర్తించిన ప్రియుడు

తెలివిగా ప్రవర్తించిన ప్రియుడు

గత ఏడాది మే 18వ తేదీన శాడిస్టు అఫ్తాబ్ అతనితో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ అలియాస్ శ్రద్దాను గొంతు కోసి చంపాడు. శ్రద్దాను హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. తరువాత తెలివిగా మెహ్రులి అడవితో సహా ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో శ్రద్దా శరీరంలోని ముక్కలను విసిరేసి అఫ్తాబ్ కేసు నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు.

తీహార్ జైల్లో శాడిస్టు

తీహార్ జైల్లో శాడిస్టు

అర్ధరాత్రి సమయంలో శ్రద్ధా శరీర భాగాలు ఓ బ్యాగ్‌ లో వేసుకుని బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తిరిగి ఆ ముక్కలను విసిరేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. శ్రద్దా తండ్రి కేసు పెట్టడంతో ఆమె దారుణ హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. గతేడాది నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. శ్రద్దా హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

సైకో లాగా టార్చర్ పెట్టాడు

సైకో లాగా టార్చర్ పెట్టాడు

అఫ్తాబ్ పూనావాలా తన స్నేహితులతో, శ్రద్ధా స్వయంగా చేసిన చాటింగ్ వివరాలు పోలీసులకు చిక్కాయి. వివిద కారణాలు అడ్డం పెట్టుకుని శ్రదాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ ప్రతిరోజూ కొట్టేవాడని వెలుగు చూసింది. పత్రి రోజూ అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్ధను చిత్రహింసలు పెట్టేవాడు. గతేడాది మే 18న అఫ్తాబ్‌కు శ్రద్ధాతో ఇలాగే గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన అఫ్తాబ్ ఆమెను గొంతుకోసి హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు.

6 వేల పేజీల చార్జ్ షీట్

6 వేల పేజీల చార్జ్ షీట్

శ్రద్దాను 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచాడు. హత్యానంతరం అఫ్తాబ్‌కు మరో స్నేహితురాలు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ స్నేహితురాలు కూడా శ్రద్ధా మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచిందన అతని ఫ్లాట్‌కి వచ్చిందని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రద్ధకు ఇచ్చిన ఉంగరాన్ని అఫ్తాబ్ అతని మరో ప్రియురాలికి బహుమతిగా ఇచ్చాడని వెలుగు చూసింది శ్రద్దాను హత్య చేసిన కేసులో అనేక మందిని విచారణ చేసిన సోలీసులు 6,636 పేజీల చార్జ్ షీట్ తయారు చేసి కోర్టు ముందు సమర్పించారని వెలుగు చూసింది.

English summary
Delhi Police submitted 6,636 page charge sheet to court in Delhi Shraddha murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X