మోడీ పాలనకు రిఫరెండంకాదు, వెంకయ్య ఏం చెప్పారంటే: అమిత్‌షా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు కొలమానం కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం అన్నారు. సర్వేల సంగతి ఎలా ఉన్నా తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని చెప్పారు. కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అవుతారన్నారు.
ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్నాయని చెప్పారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పాలనకు ఏమాత్రం రిఫరెండం కాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై అమిత్ షా మాట్లాడుతూ... వెంకయ్య చెప్పింది అదేనని, ఢిల్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి పదవి కోసమని, మీకు కూడా రాజ్యాంగం తెలుసునని ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. ఢిల్లీ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకోలేవని చెప్పారు.
బీజేపీకి మద్దతు ప్రకటించిన గుర్మీత్ సింగ్
డేరా సచ్చ సౌదా చీఫ్, సినీ స్టార్ గుర్మీత్ సింగ్ బీజేపీకి మద్దతు పలికారు. తనకు ఢిల్లీలో 20 లక్షల మంది అనుచరులున్నారని, కనీసం 10 లక్షల మందికి ఢిల్లీలో ఓట్లున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గుర్మీత్ సింగ్ హీరోగా నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్' వివాదాస్పదమయ్యింది. తాను దేవుడునని చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications