ఢిల్లీ లాక్‌డౌన్: స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత: సగంమంది ఉద్యోగులు ఇళ్ల నుంచే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితంగా తయారైంది. కాలుష్యం తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చడాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఆదేశాలను జారీ చేశారు.

పాఠశాలు, కళాశాలలు నిరవధికంగా మూసివేత..
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం పాక్షికంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. పాఠశాలలు, కళాశాలలన్నింటినీ నిరవధికంగా మూసివేసింది. వర్చువల్ విధానంలో తరగతులను కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని మళ్లీ ఎప్పుడు తెరవాలనేది ఈ ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వారం కాదు..
వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తామని ఇదివరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యార్థులు వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు. దీన్ని నిరవధికం చేసింది ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కార్యాలయం. వాయు కాలుష్యం పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకూ ఈ మూసివేత కొనసాగుతుందని తెలిపింది.

సగం మంది ఇళ్లకే పరిమితం..
ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇప్పటికే మూత పడ్డాయి. ఉద్యోగులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో విధులకు హాజరవుతున్నారు. తాజాగా ప్రైవేటు కార్యాలయాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలంటూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే భౌతికంగా కార్యాలయాలకు హాజరయ్యేలా సూచనలు జారీ చేయాలని సూచించింది.

పొరుగు నగరాలకు కూడా..
ఈ పాక్షిక లాక్‌డౌన్ విధానం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రాల నగరాలకు కూడా వర్తింపజేశారు. హర్యానా పరిధిలోని గుర్‌గావ్, ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్, సోనిపట్, ఫరీదాబాద్ వంటి నగరాల్లోనూ దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆదేశాలను ఉల్లంఘించ కూడదని ఆదేశించారు. 50 శాతానికి మంచి పని చేసే కార్యాలయాలపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
Recommended Video

భవన నిర్మాణ పనులు నిలిపివేత..
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో భవన నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. ఈ నెల 21వ తేదీ వరకూ నిర్మాణ పనులపై నిషేధం కొనసాగుతుంది. పాత భవనాల కూల్చివేత గానీ, కొత్త కట్టడాల నిర్మాణం గానీ చేపట్ట కూడదంటూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కార్యాలయం స్పష్టం చేసింది. అలాంటి పనులకు పూనుకుంటే భారీ జరిమానాలను విధిస్తామని హెచ్చరించింది. భవన నిర్మాణాల్లో వినియోగించే కంకర, ఇసుక, సిమెంట్ వంటి వస్తువులను అన్‌లోడ్ చేసుకోకూడదని, వాటిని రోడ్లపై పడేయ కూడదని సూచించింది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications