దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు లష్కర్ పన్నాగం- కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక
దేశ రాజధానిపై ఉగ్రదాడి ముప్పు పొంచివుంది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరగొచ్చంటూ తెలిపాయి. నిత్యం జనంతో కిటకిటలాడే చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయం కూడా ఉగ్రవాదుల దాడి లక్ష్యంగా కావొచ్చని సూచించాయి. పాకిస్తాన్ ప్రోత్సహిత లష్కరే తొయిబా ఈ దాడులకు పాల్పడవచ్చని పక్కా సమాచారం అందినట్లు వివరించాయి.
దీంతో భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. ఈ నెల 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ నరమేథం వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ పన్నిన కుట్రను ఆఫ్ఘనిస్తాన్ అమలు చేసిందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇస్లామాబాద్ మసీదుపై చోటు చేసుకున్న దాడికి ప్రతీకారంగా భారత్‌లో మారణ హోమానికి పాల్పడాలని లష్కరే తొయిబా ప్రయత్నాలు సాగిస్తోన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఈ దాడుల కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (IED) ను వినియోగించవచ్చని, ఈ మధ్యకాలంలో పెద్ద మొత్తంలో ఆ ఉగ్రవాద సంస్థ ఐఈడీని సమకూర్చుకుందని అంచనా వేసినట్లు వెల్లడించింది. ఢిల్లీతో పాటు భారత్‌లో ఓ భారీ ఉగ్రదాడికి ప్రణాళిక వేస్తోన్నారని, ప్రధాన దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.
ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా ఏజెన్సీలు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. సమస్యాత్మక, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశాయి. ప్రత్యేకించి పాత ఢిల్లీలోని పలు ప్రాంతాలపై డేగకన్ను వేశాయి. అదనపు బలగాలను మోహరింపజేశాయి. వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశాయి. మతపర సంస్థలు, ప్రార్థన స్థలాలు, పర్యాటక ప్రాంతాల వద్ద యాంటీ-సాబోటేజ్ తనిఖీలను చేపట్టారు పోలీసులు.
గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట వద్ద ఒక తెల్లటి హ్యుండాయ్ ఐ20 కారు పేలుడు సంభవించిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌కు చెందిన వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఉమర్ నబీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అప్పట్లో. ఈ వాహనాన్ని అతను స్వయంగా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎర్రకోట పరిసరాల్లో 24 గంటల గస్తీ, నిఘా చర్యలతో భద్రతను పటిష్టం చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications