ఢిల్లీలో కొత్తగా కేవలం 85 కరోనా కేసులు... ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం...

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం(జూన్ 26) కేవలం 85 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.ఈ ఏడాది ఇప్పటివరకూ ఢిల్లీలో ఒక్కరోజులో నమోదైన తక్కువ కేసులు ఇవే. ప్రస్తుతం అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 1.2శాతానికి పడిపోగా... 1598 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 9 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 24,961కి చేరింది.

గడిచిన 24 గంటల్లో మరో 158 మంది కరోనాతో డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 14,07,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.14శాతంగా ఉంది. ఇప్పటివరకూ 2,12,03,679 శాంపిళ్లను పరీక్షించారు.

delhi reports just 85 covid cases lowest single day spike in 2021

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1183 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 3.01కోట్లకు చేరగా మృతుల సంఖ్య 3.94లక్షలకు చేరింది. ప్రస్తుతం కేవలం 6లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 61.19 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరగ్గా.. ఇప్పటివరకూ మొత్తం 31 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేవారు. ఈ నెల 21న అత్యధికంగా 90 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 48 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు ఉండగా తమిళనాడులో 9,మధ్యప్రదేశ్‌లో ఏడు ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్‌ గురించి అనవసర అపోహలు,భయాలు వద్దని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ ముప్పుకు అది కారణమవుతుందా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అయితే డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళనకారకంగా గుర్తించినందునా... కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గాయన్న నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+