మోడీ ప్లాన్‌తో అతనినే కొట్టిన కేజ్రీ, క్షమించేశారు: కేరింతలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిది. మోడీ హవాను వెనక్కి నెట్టి, కాంగ్రెస్ పార్టీని మరోసారి ఖంగుతినిపించి.. ఏఏపీ 67 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏఏపీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తోందనేందుకు సంకేతాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు.

సోషల్ మీడియా
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకొని కూడా లబ్ధి పొందింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాను కేజ్రీవాల్ లేదా ఏఏపీ ఉపయోగించి మోడీని దెబ్బకొట్టింది.

అందరిలోకి చొచ్చుకెళ్లారు
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో ఆయన మొదటి నుండి అక్కడ పర్యటించారు. ఎన్నికల సమయంలోను చిన్నా, పెద్ద తేడా లేకుండా అంతటా తిరిగారు.

క్షమించిన మిడిల్ క్లాస్
మిడిల్ క్లాస్, యవత అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన క్షమాపణలను ఆమోదించాయి. ఇది కూడా కలిసి వచ్చిందని చెబుతున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు క్షమాపణలు చెప్పేందుకు వెనుకాడతారు. కానీ కేజ్రీవాల్.. తాను 49 రోజులకే రాజీనామా చేయడంపై క్షమాపణ చెప్పారు.

బీజేపీ నాయకత్వలేమి!
భారతీయ జనతా పార్టీలో నాయకత్వం ఇబ్బందులు తలెత్తాయి. కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ సీనియర్లకు, కేడర్‌కు ఏమాత్రం రుచించలేదు.

మోడీ ఫర్ పీఎం, కేజ్రీవాల్ ఫర్ సీఎం
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీని కూడా వెనుకేసుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మోడీ ఫర్ పీఎం, కేజ్రీవాల్ ఫర్ సీఎం అంటూ నినదించారు. ఇది కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందంటున్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిది. మోడీ హవాను వెనక్కి నెట్టి, కాంగ్రెస్ పార్టీని మరోసారి ఖంగుతినిపించి.. ఏఏపీ 67 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏఏపీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తోందనేందుకు సంకేతాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెబుతున్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఏఏపీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదు.

Click it and Unblock the Notifications