వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొరుగున గడ్డి దగ్దం.. హస్తిన వాసికి సంకటం

పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాలతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్నదాతలు తమ పంట పొలాల్లో గడ్డిదుబ్బులు దగ్ధం చేయడం వచ్చే పొగ.. గాలిలో తేమ కలగలిసి వాయువులు విష పూరితంగా మారుతున్నాయి. ఇది హస్తిన వాసికి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తిన నగరానికి పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పొలాల్లో మంటలకు దేశ రాజధాని 'హస్తిన' నగరం పొగసూరిపోతోంది. ఆయా రాష్ట్రాల్లోని వరిపొలాల్లో మిగిలిపోయిన గడ్డి, గడ్డి దుబ్బులను రైతులు దగ్ధం చేయడం ఢిల్లీ నగర వాసులకు శాపంగా మారుతోంది. ఆ పొగ అంతా కొట్టుకొచ్చి పొగమేఘంగా మారి ఢిల్లీ మీద దుప్పటి మాదిరిగా పరుచుకుంటోంది. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ అల్లాడిపోతున్నది. దీనికి పంటల దగ్ధంతో వచ్చే పొగ మరో పెద్ద సమస్యగా పరిణమించింది. ఢిల్లీలో వాహన కాలుష్యం ప్రధాన సమస్యగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. నగర శివార్లలోని పారిశ్రామిక వాడల నుంచి, నగరంలో పెద్దఎత్తున సాగే నిర్మాణ కార్యకలాపాల నుంచి దుమ్ము, ధూళి, పొగ, ప్రమాదకర విషవాయువులు అన్నీ కలిసి హస్తినలో కాలుష్యాన్ని బహుముఖంగా పెంచేస్తున్నాయి.
దీనికి పొరుగు రాష్ట్రాల్లోని పొలాల్లో మంటల నుంచి వస్తున్న పొగ జత కలిసి మరింత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పొగ మేఘాలు ఉదయం వేళల్లో అక్కడ దారి కూడా కనిపించనంతగా కమ్ముకుంటున్నాయి. ఉదయం వేళల్లో అక్కడ వాహనాలు ప్రమాదానికి గురికావటానికి ఇది కూడా ఒక కారణం. ఢిల్లీలో కాలుష్యం సమస్య ఈనాటిది కాదు. ప్రభుత్వాలు నామమాత్రంగా చేపడుతున్న చర్యలతో ఫలితం ఉండటం లేదు. ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించే వరకూ పరిస్థితి విషమించింది.

Recommended Video

Delhi Enveloped In Blanket Of Smog Pollution, VIDEO
 కాలం చెల్లిన వాహనాలు ఒక కారణమే

కాలం చెల్లిన వాహనాలు ఒక కారణమే

2002 నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో వాహనాల సంఖ్య 97 శాతం పెరిగింది. ఈ వాహనాలు వెదజల్లే పొగ అక్కడ కాలుష్యానికి ప్రధాన కారణం. మనదేశంలో కాలుష్య నివారణ నిబంధనలు కఠినంగా అమలు కాక కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు, గాలిలోకి ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లే ఫ్యాక్టరీలను పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొన్నది. గాలిలో సల్ఫర్‌ డైఆక్సైడ్‌ నిల్వలు అత్యధికంగా చైనాలో నమోదు అవుతుండగా తర్వాత స్ధానంలో మనదేశం ఉంది. కాలుష్య ప్రామాణికం పీఎం 2.5 (పార్టికల్‌ మ్యాటర్‌) ఢిల్లీలో గణనీయంగా పెరిగి క్యూబిక్‌ మీటర్‌కు 400 మిల్లీ గ్రాములకు మించిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు లేకుండానే హస్తినలో లక్షల వాహనాలు తిరుగుతున్నాయంటే ఇటీవలి అధ్యయనంలో తేలిందంటే హస్తిన వాసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వల్లే ఢిల్లీలో కాలుష్యం సమస్య తలెత్తుతున్నది. 15 ఏళ్లు దాటిన వాహనాలు తిప్పొద్దని 2014లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది కూడా.తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీ నగరంలో కార్లు 31.72 లక్షలు, బైక్‌లు 66.48 లక్షలతో కలిపి 1.05 కోట్ల మేరకు ఉన్నాయి. వీటికి తోడు క్యాబ్ లు 1.18 లక్షలు, రవాణా వాహనాలు 2.25 లక్షలు, బస్సులు 35,332, మ్యాక్సీ క్యాబ్ లు 30,207 ఉంటాయని రికార్డులను బట్టి తెలుస్తున్నది. ఇక ఒక టన్ను గడ్డి మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ రెండు కిలోలు, పార్టికల్ మీటర్ మూడు కిలోలు, కార్బన్ మోనాక్సైడ్ 60, కార్బన్ డయాక్సైడ్ 1460 కిలోలతోపాటు బూడిద 199 కిలోలు వెలువడుతుందని ఒక అంచనా.

 పంటల దగ్ధం నిలిపేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు కేజ్రీ లేఖలు

పంటల దగ్ధం నిలిపేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు కేజ్రీ లేఖలు

దక్షిణాది రాష్ట్రాల్లో వరి కోతలు కోసి పంట నూర్పిడి తర్వాత ఎండు గడ్డిని పశువులకు మేతగా వేసేందుకు ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లకు ఎత్తి తీసుకువెళ్తారు. పొలంలో మిగిలిన వరి దుబ్బులు అలాగే ఉండిపోయాయి. అవి వేసవి నాటికి బాగా ఎండి ఆ తర్వాత పొలం దున్నినప్పుడు మట్టిలో కలిసిపోతాయి. కానీ ఢిల్లీకి సమీపంలోని పంజాబ్‌, హర్యానాలో వరి కోతల తర్వాత పొలాల్లో మిగిలిన గడ్డి దుబ్బులను తలగబెడతారు. రెండో పంటగా గోధుమ వేయటం కోసం పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో అది అక్కడ తప్పనిసరి చర్య. లేకుంటే కూలీలను పెట్టి గడ్డి దుబ్బులను తొలగించాలి. ఇది అదనపు ఖర్చు కాబట్టి రైతులు గడ్డి దుబ్బులను పొలంలోనే తగలబెడతారు. శీతాకాలం ప్రారంభంలో పంజాబ్‌, హర్యానా వైపు నుంచి గాలి ఢిల్లీ వైపు వీస్తూ ఉంటుంది. దీంతో పొలాల్లో మంటల నుంచి వెలువడే పొగ ఢిల్లీ వైపు కొట్టుకువస్తుంది. ఢిల్లీలో కాలుష్యానికి వాహన కాలుష్యం 60 శాతం వరకూ కారణమైతే, పొలాల నుంచి వచ్చే పొగ 20 శాతం వరకూ కారణమని అంచనా. రైతులు తమ పొలాల్లో గడ్డి మంటలు వేయకుండా అదుపు చేసేందుకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.

 పరిహారం చెల్లించాలన్న న్యాయస్థానాల ఆదేశాలు భేఖాతర్

పరిహారం చెల్లించాలన్న న్యాయస్థానాల ఆదేశాలు భేఖాతర్

పొలాల్లో గడ్డి మంటలు వేయకుండా ఉండాలంటే దాన్ని తరలించి ఎక్కడైనా దూరంగా పడవేయాలి. ఇందుకు రవాణా, కూలీల ఖర్చు ఉంటుంది. మంటలు వేయవద్దని ప్రభుత్వం చెప్పినా అక్కడి రైతులు వినటం లేదు. రవాణా, కూలీల ఖర్చు ఎవరు పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. గడ్డి తొలగించేందుకు ఎకరానికి రూ.1500 నుంచి రూ.2000 వరకూ రైతులకు ఖర్చుల కింద ఇవ్వాలని న్యాయస్ధానాలు గతంలో ఆదేశించాయి. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పక్కాగా అమలు చేయటం లేదు. అదే సమయంలో పొలాల్లో మంటలు వేసి కాలుష్యానికి కారణమవుతున్నారని ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రైతులకు జరిమానాలు విధిస్తున్నారు. పంజాబ్‌లోని వరి పొలాల నుంచి ఏటా రెండు కోట్ల టన్నుల వరి గడ్డి లభిస్తుంది. గోధుమ పంటను వెంటనే వేయటానికి వీలుగా ఈ గడ్డిని తగలబెడటం ఆనవాయితీగా మారింది. హర్యానాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో గడ్డి దగ్ధం గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పట్టినా పూర్తిగా నిలిచిపోలేదు.

 ఉదయం, సాయంకాలం బయటకు రావొద్దన్న వైద్యులు

ఉదయం, సాయంకాలం బయటకు రావొద్దన్న వైద్యులు

కాలుష్యం అదుపు తప్పి ఢిల్లీలో గాలి ప్రమాదకరంగా మారింది. ఆ గాలి పీల్చితే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత వైద్య సంఘం (ఐఎంఎ) కూడా హస్తినలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. దీర్ఘకాలం పాటు ఇటువంటి గాలి పీల్చితే అస్తమా, సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిజార్డర్‌), గుండె పోటు, కేన్సర్‌ వంటి వ్యాధుల బారిన పడొచ్చు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాలైన ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గుర్గావ్‌, నోయిడా ప్రాంతాల్లో సైతం ఈ సమస్య ఉంది. ఢిల్లీలో ఇంటిలోనూ, భూగర్భ మెట్రో రైల్వే స్టేషన్లలోనూ విష వాయువులను పీలుస్తున్న ప్రజల కళ్లలో నీరు కారుతున్నాయి. ఉదయం, సాయంకాలం వేళల్లో బయటకు రావద్దని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరింత విషమిస్తే తక్షణ చర్యలు ఇలా

మరింత విషమిస్తే తక్షణ చర్యలు ఇలా

కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ)కు చెందిన గాలి నాణ్యత సూచీలో 487 పాయింట్లుగా ఢిల్లీ వాయు కాలుష్యం నమోదైంది. ఒకవేళ వాయు కాలుష్యం 500 పాయింట్లకు చేరితే.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) ప్రకారం సరి-బేసి వాహన విధానం అమలు, నిర్మాణాలు, కూల్చివేత కార్యక్రమాలపై నిషేధం, పరిశ్రమల మూసివేత వంటి చర్యలు చేపట్టాలి. దీంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రద్దీ సమయంలో మెట్రో చార్జీలను తగ్గించడంతోపాటు పార్కింగ్ చార్జీలను నాలుగు రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఇంత జరిగినా మెట్రో సర్వీసు ట్రిప్పులను పెంచేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించిన ఢిల్లీ మెట్రో కార్పొరేషన్.. చార్జీల తగ్గింపుపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. మున్సిపల్ సంస్థలు కూడా పార్కింగ్ రేట్ల పెంపుదలను ఇంకా ప్రకటించలేదు. కాలుష్యం ఢిల్లీ నగరంలోనే కాకుండా రాజధాని ప్రాంతం మొత్తం విస్తరించిందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి రెండు మూడురోజులపాటు కొనసాగే అవకాశమున్నదని తెలిపారు. కాగా శ్వాస సమస్యలతోపాటు కండ్లలో నుంచి నీళ్లు కారుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. గాలికాలుష్యం కారణంగా ఢిల్లీలో శ్వాసకోశవ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య 20శాతం వరకు పెరిగిందని సమాచారం.

English summary
Air quality in Delhi is set to worsen in the next few days, but this time the city has no one but itself to blame, least of all paddy stubble-burning in Haryana and Punjab. This conclusion can be drawn going by the forecast of the India Meteorological Department and the Central Pollution Control Board (CPCB) and their observations on the prevailing weather conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X