Delhi కరోనా పరిస్థితిపై వన్‌ఇండియా రిపోర్టు: పెరుగుతున్న మృతుల సంఖ్యకు కారణమిదే..!

కరోనా వైరస్... ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్నంతటిని గడగడలాడిస్తున్న కనిపించని వైరస్. ఈ మహమ్మారి భారత్‌లో విలయతాండవం ఆడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. ఈ కనిపించని శతృవుకు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక అన్ని రాష్ట్రాలకంటే అత్యంత దుర్బేధ్యంగా మారింది ఢిల్లీలోని పరిస్థితి. చాలా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ కొరత రావడంతో పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడం మానేశాయి. అంతేకాదు చాలా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేక రోగులు కుప్పకూలిపోతున్నారు. క్షణ క్షణంకు మరణాలు పెరిగిపోతుండటంతో ఢిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

 ఢిల్లీని వణికిస్తున్న కరోనా

ఢిల్లీని వణికిస్తున్న కరోనా

కరోనావైరస్ ఢిల్లీని వణికిస్తోంది. అక్కడ పాజిటివ్ రేటు 30శాతానికి పైగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు గంట గంటకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో భయానక వాతావరణం నెలకొంది. కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తుండటంతో ప్రజలు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో కాలం వెల్లదీస్తున్నారు. పొరపాటు కరోనా సోకితే హాస్పిటల్‌కు వెళ్లినా అక్కడ ఆక్సిజన్ కొరత ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్స్‌లో పడకలు కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న ఆవరణలోనే పేషెంట్స్ పడుకోవడం చూస్తూ ఎవరికైనా సరే కంటనీరు ఆగదు. వారు అనుభవిస్తున్న వేదన చూస్తే గుండె తరుక్కుపోక మానదు. ఒక వేళ తమ రాష్ట్రాల్లో మిగులు ఆక్సిజన్ ఉంటే ఢిల్లీకి పంపాలంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మిగతా రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు.

అంబులెన్స్ కొరత

ఇక హాస్పిటల్‌కు చేరుకుంటున్న రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే బతుకుతారని వైద్యులు చెబుతున్నారు. కానీ ఐసీయూలో పడకలు లేవు. పడకల కోసం వేచిచూసి చివరకు ప్రాణాలు వదులుతున్నారు. ఇదే దృశ్యం ఢిల్లీలోని అన్ని హాస్పిటల్స్‌లో కనిపిస్తోంది. ఇక ఢిల్లీలో ఉన్న ప్రజలకు కరోనా సోకితే వారు ప్రాణాలతో బయటపడాలంటే కచ్చితంగా ఏదో అద్భుతం ఏదో ఒక రూపంలో జరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా హాస్పిటల్స్ కరోనా పేషెంట్లతో నిండిపోవడం, కొత్తగా పేషెంట్లను చేర్చుకోకపోవడం, ఆక్సిజన్ కొరత తలెత్తడంతో అక్కడ మరణాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇక కొన్ని హాస్పిటల్స్‌లో పడకలు ఉన్నప్పటికీ పేషెంట్‌ను తరలించేందుకు అంబులెన్స్ కొరత మరొక అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ బంగారం కంటే మరింత విలువైందిగా మారింది. ఆక్సిజన్ ట్యాంకర్లను పోలీస్ ఎస్కార్టు మధ్య తరలిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు.

ఉదయం లేస్తే పడకల కోసం...

ఉదయం లేస్తే పడకల కోసం...

ఒక్క ఢిల్లీ నగరంలో రోజుకు 24వేలకు పైగా కేసులు గత కొద్దిరోజులుగా నమోదవుతున్నాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి కోవిడ్ పేషెంట్ల కుటుంబ సభ్యలు ఏ హాస్పిటల్‌లో బెడ్లు ఖాళీగా ఉన్నాయా అంటూ తమ స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేస్తూ కనిపిస్తున్నారు. వారు ఉంటున్న చోటు నుంచి అది ఎంత దూరమైనా సరే బెడ్ ఖాళీగా ఉందని తెలిస్తే అక్కడికి పేషెంట్‌ను వెంటవేసుకుని పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళితే అప్పటికే ఆ ఖాళీగా ఉన్న పడక మరొకరికి కేటాయించడంతో నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. ఇక మరో ప్రధాన సమస్య ఆక్సిజన్. ఆక్సిజన్ కొరత తలెత్తడంతో శనివారం రోజున ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్స్ యాజమాన్యం పేషెంట్లను తమ ఇళ్లకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పేసింది. అక్కడ ఆక్సిజన్ లేదని మరో హాస్పిటల్‌కు లేదా ఇంటికి పేషెంట్లను తరలించాలంటూ చెప్పేశారు. ఇక కొన్ని హాస్పిటల్స్‌ బయట కొత్త అడ్మిషన్స్ చేర్చుకోవడం లేదనే బోర్డులు కనిపిస్తున్నాయి.

ఆక్సిజన్ ఉంటేనే ఏమైనా చేయగలం: డాక్టర్లు

ఆక్సిజన్ ఉంటేనే ఏమైనా చేయగలం: డాక్టర్లు

సెకండ్ వేవ్ చాలా ప్రమాదంగా ఉందని చెబుతున్నారు కేరళ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ ఫతాహుద్దీన్. ఆక్సిజన్ సరఫరా లేకుంటే డాక్టర్లు కూడా ఏమీ చేసేది లేదంటూ చెబుతున్నారు. వెంటిలేటర్లు, బై-పాప్ మెషీన్లు పనిచేయాలంటే అధిక పీడనం కలిగి ఉన్న లిక్విడ్ ఆక్సిజన అవసరమని చెబుతున్నారు. ఎప్పుడైతే పీడనం తగ్గిపోతుందో ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రం విఫలమవుతుందని చెబుతున్నారు. దీంతో ఆక్సిజన్ అందక పేషెంట్లు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ రోగి స్థిరంగా ఉండాలంటే ఆక్సిజన్ సప్లయ్ ఉండాలని చెబుతున్నారు. ఆక్సిజన్ ఉంటే ఆ సమయంలో పేషెంట్ పరిస్థితి స్థిరంగా ఉంటుందని అదే సమయంలో డాక్టర్లకు కూడా ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై ఒక ఐడియా వస్తుందని చెప్పారు. పేషెంట్ల కోసం వెంటనే రెడీమేడ్ హాస్పిటల్స్‌ను నిర్మించడంలో ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే ముందువరసలో ఉంటుంది. వెంటనే వారి సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ ఫతాహుద్దీన్ చెబుతున్నారు. హాస్పిట్స్‌లో పడకలు దొరక్క చాలామంది ఇంట్లోనే ఉంటూ చివరకు ప్రాణాలు వదులుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న సమాచారంలో వీరిపేర్లు ఉండవని చెప్పారు. వీరిని కూడా కలుపుకుంటే దేశంలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+