షాక్: 18 ఏళ్ల లోపే గర్స్, బాయ్స్ అలవాటు పడ్తున్నారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అల్కాహాల్ తీసుకుంటున్న వారిలో... 83.8 పర్సెంట్ యువకులు, 64.6 యువతులు తమకు పద్దెనిమిది సంవత్సరాలు రాకముందే దీనిని అలవాటు చేసుకుంటున్నారట. అల్కాహాల్ పైన సోమవారం ఓ సర్వేలో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి.
11.1 పర్సెంట్ యువకులు, 2.1 పర్సెంట్ యువతులు తాగేందుకు నెలకు 8వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. అల్కాహాల్‌కు యువత ఎంతగా ఎడిక్ట్ అవుతున్నారనే విషయంపై ఓ సంస్థ సర్వే చేసింది.
34.5 శాతం మగవాళ్లు, 28 శాతం ఆడవాళ్లు వారంలో రెండు నుండు నాలుగుసార్లు అల్కాహాల్ తీసుకుంటున్నారని సర్వేలో తేలింది.

అల్కాహాల్
77 శాతం మంది యువకులు, 46 శాతం మంది యువతులు ఓసారి డ్రింక్ తీసుకునే సమయంలో ఐదు పెగ్గులకంటే ఎక్కువనే తాగుతున్నారట.

అల్కాహాల్
కంపెయిన్ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (సిఏడిడి) అనే ఎన్డీవో సంస్థ ఈ సర్వే చేసింది. ఈ సంస్థకు చెందిన సింఘాల్ మాట్లాడుతూ... నేటి యువతకు గతంలో కంటే ఎక్కువ స్వేచ్ఛ ఉందని, గతంలో కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, అలాగే అల్కాహాల్ అందుబాటులో ఉంటుందని అదేవిధంగా డ్రింకింగ్ సంస్థలు జోరుగా ప్రచారం చేస్తున్నాయని ఈ కారణంగా యువత తాగుడుకు బానిస అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అల్కాహాల్
ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రమాదాలు తాగి వాహనాలు నడిపించడం వల్లనే జరుగుతున్నాయని సిఏడిడి సంస్థకు చెందిన ప్రిన్స్ సింఘాల్ అంటున్నారు.

అల్కాహాల్
ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న వయస్సులోనే తాగుడుకు అలవాటు అయిన యువత వల్లనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications