ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్ లా మారిన ఢిల్లీ.. స్కూళ్లకు నిరవధిక సెలవులు..

ఢిల్లీలో పరిస్థితి మారడం లేదు. కాలుష్యం స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా ఉండటంతో నేడు జరగాల్సిన హాఫ్ మారథాన్ ను సైతం రద్దు చేశారు.

Recommended Video

    Delhi Enveloped In Blanket Of Smog Pollution, VIDEO

    ఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితి మారడం లేదు. కాలుష్యం స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా ఉండటంతో నేడు జరగాల్సిన హాఫ్ మారథాన్ ను సైతం రద్దు చేశారు.

    ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ చెత్తను తగులబెడుతూ ఉండటంతో ఏర్పడిన వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

    చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆస్తమా తదితర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇప్పుడున్న గాలి పీలిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

    ప్రస్తుతం ఢిల్లీ నగరం ఓ గ్యాస్ చాంబర్ లా ఉందని అభివర్ణించిన సీఎం కేజ్రీవాల్, చిన్నారులు బయటకు రావడం క్షేమకరం కాదని అన్నారు. తప్పనిసరి పనుల మీద బయటకు వచ్చిన పలువురు తమ కళ్లు నొప్పిగా ఉన్నాయని, గొంతులో మంట పుడుతోందని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

    గాలిలో కాలుష్యం 100 రీడింగ్ ను దాటితేనే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ప్రమాదకరంగా పరిగణిస్తుంది. ఈ రీడింగ్ గరిష్ఠంగా 500 వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య స్థాయి 451కి చేరిందంటే, పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+