అదనంగా చట్నీ వేయమన్నందుకు చితకబాదారు: కేసు

న్యూఢిల్లీ: ఓ హోటల్‌లో చోటుచేసుకున్న చిన్న వివాదం ఒకరిని ఐసీయూలో చేర్చగా, రెండు పోలీసు కేసుల నమోదుకు దారితీసింది. సన్నీ అనే యువకుడు ఓ హోటల్‌లో అదనంగా చట్నీ వేయమని అడిగినందుకు హోటల్‌ యజమాని చితకబాదాడు. దీంతో అతడు ఐసియూలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించి బాధితుడు సన్నీ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిలోక్‌పురి ప్రాంతంలోని ఒక బేకరీలో అల్పాహారం తింటున్న అతను, మరికాస్త చట్నీ వేయమన్నాడు. దీంతో ఆ హోటల్ యజమాని కమల్‌ ఇనుపచువ్వతో దాడిచేశాడు.

Delhi youth asks for extra sauce, is thrashed by eatery owner

యజమాని దాడిలో సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, సన్నీ ఫిర్యాదుతో పోలీసులు కమల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కమల్‌ ఫిర్యాదు మరో విధంగా ఉంది.

సన్నీ ముందు చట్నీ అడిగాడనీ, ఆ తర్వాత నిరాకరించి అనవసరంగా దుర్భాషలాడాడని చెప్పాడు. అంతేగాక, సన్నీ తన స్నేహితులతో కలిసి తమపై దాడి చేశాడని కమల్‌ తెలిపాడు. ఈ మేరకు కమల్ ఫిర్యాదుతో సన్నీపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+