3నెలల క్రితమే పెళ్లి: యువకుడి ప్రాణం తీసిన ల్యాప్‌టాప్
న్యూఢిల్లీ: ఓ యువకుడు ల్యాప్‌టాప్ వాడుతుండగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోవింద్‌పురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్(23) అనే యువకుడు ఛార్జింగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు.
ఒక్కసారిగా షాక్ కొట్టడంతో బ్రిజేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబీకులు బ్రిజేశ్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఫోరెన్సిక్ టీం సాయంతో సెక్షన్174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిజేశ్‌కి మూడు నెలల క్రితమే వివాహమైంది. భర్త మరణంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరంగా అతని గత చరిత్ర, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం, ఇంట్లో విద్యుత్ సరఫరాకి సంబంధించి ఏర్పాటుచేసిన ఎర్తింగ్ పరిస్థితి, ల్యాప్‌టాప్ నాణ్యత, తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications