'విభజన కుట్ర జరిగింది అక్కడే.. ఆ భవనాన్ని కూల్చివేయండి'

Subscribe to Oneindia Telugu

ముంబై: ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న దక్షిణ ముంబైలోని మహమ్మద్ జిన్నా నివాసాన్ని కూల్చివేయాలని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్‌ మంగళ్‌ ప్రభాత్‌ లొథా మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాన్సులర్ కార్యాలయ ఏర్పాటు కోసం ఈ భవనాన్ని తమకు కేటాయించాలని పాక్ పలుమార్లు భారత్ ను అభ్యర్థించినా.. భారత్ ప్రతిస్పందించలేదు. జిన్నా కుమార్తె సైతం ఈ ఇంటిపై వారసత్వ హక్కుల కోసం గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన జిన్నా నివాసాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలని మంగళ్ ప్రభాత్ సూచించారు. దక్షిణ ముంబయిలో సుమారు 2.5 ఎకరాల్లో ప్యాలెస్ తరహాలో ఈ నివాస భవనం ఉంది. భారత్-పాక్ విభజనకు గుర్తుగా దీన్ని వెంటనే కూల్చివేయాలని, ఈ నివాసంలోనే దేశ విభజనకు సంబంధించిన కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.

Demolish Sprawling 2.5 Acre Jinnah House In Mumbai, Says BJP Legislator

నిరుపయోగంగా ఉన్న ఈ ఇంటి నిర్వహణ కోసం లక్షల రూపాయలు వెచ్చించడం అనవసరమని అన్నారు.
భవనం విషయానికొస్తే.. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ ప్యాలెస్ ను 1930లో నిర్మించారు. చాలా దశాబ్దాలు ఈ నివాసం బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అధికారిక నివాసంగా ఉంది. 1982లో ఆయన ఈ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిరుపయోగంగా మారింది. దీంతో దీన్ని కూల్చివేయాలన్న డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The sprawling mansion in Mumbai built by Pakistan's founder Mohammad Ali Jinnah should be demolished, one of the city's top builders has told the government.
Please Wait while comments are loading...